SCOUCH Awards: మెప్మాకు 9 స్కోచ్ అవార్డులు
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:31 AM
ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) 9 స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్టులకు గాను 9 ప్రాజెక్టులకు ప్లాటినం అవార్డులు ప్రకటించారు.
సెప్టెంబరు 20న ఢిల్లీలో ప్రదానం
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) 9 స్కోచ్ అవార్డులను దక్కించుకుంది. వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన 14 ప్రాజెక్టులకు గాను 9 ప్రాజెక్టులకు ప్లాటినం అవార్డులు ప్రకటించారు. దుర్భర జీవితాన్ని గడిపేవారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే నివాస, బ్యాంక్ లింకేజీ, లైవ్‌లీ హుడ్ ట్రాకర్, ఈ-కామర్స్ అమ్మకాలు, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి యూనిట్లు, ప్రేరణ, సఖి, వీధి వ్యాపారుల మేనేజ్‌మెంట్ తదితర పథకాలకు అవార్డులు అందజేయనున్నారు. సెప్టెంబరు 20న ఢిల్లీలో స్కోచ్ ప్లాటినం అవార్డులు ప్రదానం చేయనున్నారు. మెప్మా తరఫున మెప్మా మిషన్ డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్ అవార్డులను అందుకోనున్నారు. ఈ అవార్డులు దక్కించుకునేందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
Updated Date - Jun 09 , 2025 | 04:33 AM