ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NASA: శభాష్‌ జాహ్నవి

ABN, Publish Date - Jun 27 , 2025 | 06:34 AM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది మన తెలుగమ్మాయి దంగేటి జాహ్నవి 23.

  • అంతరిక్షానికి వెళ్లనున్న తెలుగమ్మాయికి షెకావత్‌, పవన్‌, లోకేశ్‌ అభినందన

అమరావతి, రాజమహేంద్రవరం రూరల్‌, పాలకొల్లు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టి.. అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది మన తెలుగమ్మాయి దంగేటి జాహ్నవి (23). అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్‌ స్పేస్‌ ఇండస్ర్టీస్‌ (టీఎ్‌సఐ) చేపట్టిన టైటాన్‌ స్పేస్‌ మిషన్‌ కోసం వ్యోమగామి అభ్యర్థి (ఏఎ్‌ససీఏఎన్‌)గా ఎంపికైన జాహ్నవిని.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌తోపాటు ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందించారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరులో సైన్స్‌ సెంటర్‌ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌, డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి దుర్గేశ్‌ జాహ్నవిని పరిచయం చేశారు.

నాసా నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలిగా, యువ వ్యోమగామిగా గుర్తింపు పొంది దేశానికి కీర్తి తీసుకొచ్చావని వారు ఆమెను అభినందించారు. త్వరలోనే అమరావతిలోని తన కార్యాలమంలో కలుద్దామని ఈ సందర్భంగా పవన్‌ ఆమెకు హామీ ఇచ్చారు. కాగా, జాహ్నవి మంత్రి లోకేశ్‌ను కూడా ఆయన నివాసంలో కలిశారని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉల్లంపర్రు మాంటిస్సోరి విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎంఎస్‌ వాసు తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్‌ ఆమెను అభినందించారని, భవిష్యత్‌లో ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జాహ్నవి 10వ తరగతి వరకూ ఉల్లంపర్రు మాంటిస్సోరి స్కూల్లో చదివింది.

Updated Date - Jun 27 , 2025 | 06:34 AM