Congress Vs BJP: ఏపీసీసీ కార్యాలయం వద్ద హైటెన్షన్
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:29 PM
Congress Vs BJP: కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ నినాదాలతో విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు.
విజయవాడ, ఏప్రిల్ 30: ఏపీసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీసీసీ కార్యాలయానికి బీజేపీ నేతలు (BJP Leader) దూసుకురావడంతో హైటెన్షన్ నెలకొంది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాన మంత్రి మోదీపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. షర్మిల వ్యాఖ్యలు కమలం పార్టీ నేతలు తప్పుబట్టారు. ఈ క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బైఠాయించి ధర్నా చేస్తున్నట్లు తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. కొంతమంది బీజేపీ నేతలు, కార్యకర్తలు ఏపీసీసీ కార్యాలయానికి చేరుకుని షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మోదీపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు నినాదాలు చేయడంతో కాంగ్రెస్ నేతలు నేతలు ప్రతినినాదాలు చేశారు. బీజేపీ , కాంగ్రెస్ పార్టీ నేతల పోటీపోటీ నినాదాలు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యాలయంపై కోడి గుడ్లతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అడ్డుకున్నారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను కలువకుండా పోలీసులు అడ్డుపడ్డారు. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లబోయిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన షర్మిల.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మోదీ అభిమానులు తీవ్రంగా ఖండించారు. మోదీపై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై మోదీ అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ షర్మిలపై చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులకు పూలమ్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షర్మిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దేశ నిఘా వ్యవస్థలను మోదీ వ్యవస్థలుగా మార్చారని.. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం మోదీ కోసం పనిచేస్తోందని షర్మిల వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామాలు చేయాలని షర్మిల డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యాఖ్యలపై మోదీ అభిమాని ప్రేమ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారతదేశం నిఘా వ్యవస్థలపైనా, దేశ ప్రధాని మోదీని ఉద్దేశించి వైఎస్ షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి
Tirupati Case: వృద్ధురాలిది హత్యే.. తేల్చేసిన తిరుపతి పోలీసులు
Modi Amaravati Visit: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి.. ఆ రెండే కీలకమన్న మంత్రి
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 30 , 2025 | 05:00 PM