ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Notice to AP Govt: కసిరెడ్డి పిటిషన్‌పై విచారణ.. సర్కార్‌కు సుప్రీం నోటీసులు

ABN, Publish Date - May 02 , 2025 | 03:08 PM

Supreme Notice to AP Govt: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది. మద్యం కేసులో తనకు సీఆర్పీసీ 160 నోటీస్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కసిరెడ్డి ఆశ్రయించారు.

Supreme Notice to AP Govt

న్యూఢిల్లీ, మే 2: మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీం కోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో తనకు సీఆర్పీసీ 160 నోటీస్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కసిరెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) సుప్రీం ముందుకు విచారణకు రాగా.. జస్టిస్ జేబీ పార్థివాల , జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. తెలంగాణలో నివసిస్తున్న తనకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చే పరిధి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్ కసిరెడ్డి తరపున న్యాయవాది శ్రీహర్ష వాదనలు వినిపించారు.


విచారణ జరిపిన కోర్టు రాజ్ కసిరెడ్డి పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వంతో పాటు సిట్‌, ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను మే 13కు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. కాగా.. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని సిట్ అధికారులు గుర్తించారు. విచారణకు రావాల్సిందిగా పలు మార్లు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే కసిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో దుబాయ్‌ నుంచి వచ్చిన కసిరెడ్డి హైదరాబాద్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. అదే రోజు రెండు పర్యాయాలు అతడిని సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో అంతకు ముందు విచారించిన వారి స్టేట్‌మెంట్లను ముందు పెట్టి మరి రాజ్‌కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఆపై కోర్టులో ప్రవేశపెట్టాగా.. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు న్యాయాధికారి. దీంతో రాజ్ కసిరెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


మరోవైపు ఈ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉందని రాజ్ కసిరెడ్డిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయగా.. ఏడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రాజ్‌కసిరెడ్డిని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈరోజు ఉదయమే రాజ్‌కసిరెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని.. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్‌ కసిరెడ్డి మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు సిట్ అధికారులు.


ఇవి కూడా చదవండి

Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి

Read Latest AP News And Telugu News

Updated Date - May 02 , 2025 | 03:34 PM