Monsoon: ముందుగానే నైరుతి రుతుపవనాలు..
ABN, Publish Date - May 13 , 2025 | 11:46 AM
Monsoon:ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ పర్కొంది. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పదే అవకాశముందని పేర్కొంది.
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే కేరళ (Kerala)ను తాకనున్నాయి. మంగళవారం సాయంత్రానికి దక్షిణ అండమాన్ సముద్రం (Andaman Sea) నికోబార్ (Nicobar) దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
భిన్న వాతావరణం...
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒక వైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. సోమవారం ఏపీలో 40 నుంచి 42 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కాకినాడ, తూర్పోగోదావరి జిల్లాల్లోని 29 మండల్లో తీవ్రంగా.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాలోని మరో 41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు పెరుగుతాయని వాతావరణశాఖ పర్కొంది. ఇటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పదే అవకాశముందని పేర్కొంది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మరో కీలక ప్రాజెక్టు
రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు..
తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. కాగా సోమవారం ఖమ్మంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరో కోణంలో ఒత్తిడికి సిద్ధమైన కేంద్రం...
TGCSB:సైబర్ నేరస్తుల కోసం స్పెషల్ ఆపరేషన్
For More AP News and Telugu News
Updated Date - May 13 , 2025 | 11:46 AM