ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Liquor Scam Investigation: రెండో రోజు సిట్ విచారణకు ధనుంజయ్, కృష్ణ మోహన్

ABN, Publish Date - May 15 , 2025 | 11:31 AM

Liquor Scam Investigation: లిక్కర్ స్కాం కేసులో ధనుంజయ్, కృష్ణ మోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. నేటి సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను వేరు వేరుగా విచారించనున్నారు.

Liquor Scam Investigation

విజయవాడ, మే 15: ఏపీ లిక్కర్ స్కాం కేసులో (AP Liquor Scam) ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి రెండో రోజు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఇరువురిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. నిన్నటి (బుధవారం) విచారణలో ఇద్దరిని వివిధ రూపాలలో సిట్ ప్రశ్నించింది. అయితే సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఈరోజు (గురువారం) మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు ధనుంజయ్, కృష్ణ మోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. నేటి సాయంత్రం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను వేరు వేరుగా విచారించనున్నారు. అయితే మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని వారు చెబుతుండగా.. ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారుల మాట. మరి ఈరోజు విచారణలో సిట్ అధికారులకు సహకరిస్తారా లేదా అనేది చూడాలి.


కాగా.. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా రెండు రోజుల క్రితం ఈ కేసులో ఏ33గా ఉన్న గోవిందప్ప బాలాజీని మైసూర్‌లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి విచారించారు. ఆపై నిన్న (బుధవారం) ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. గోవిందప్పకు ఈనెల 20 వరకు రిమాండ్ విధించడంతో వెంటనే జైలుకు తరలించారు. అంతేకాకుండా గోవిందప్ప రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది సిట్. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని, జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టే ఈ స్కాంలో ఆయన కీలకంగా వ్యవహరించినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులతో బాలాజీ వ్యక్తిగతంగా లబ్ధి పొందారని.. భారీగా స్థిరాస్తులు సంపాదించినట్లు సిట్ వెల్లడించింది. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉన్నందున బాలాజీ గోవిందప్పను కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిట్ అభ్యర్థించింది. నిన్న గోవిందప్పను కోర్టులో హాజరుపరిచిన సమయంలోనే అనూహ్యంగా ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి.. సిట్ విచారణకు హాజరయ్యారు.


సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్

మరోవైపు లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డిని ఈరోజు సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. మూడు రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. కస్టడీ నిమిత్తం జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి శ్రీధర్ రెడ్డిని తీసుకువచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టైన ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు


Read Latest
AP News And Telugu News

Updated Date - May 15 , 2025 | 11:31 AM