Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు ఉగ్రవాదులు హతం
ABN , Publish Date - May 15 , 2025 | 09:30 AM
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
జమ్మూకశ్మీర్, మే 15: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir Encounter) అవంతిపొరాలో ఎన్‌కౌంటర్ జరిగింది. నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు (గురువారం) ఉదయం భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. కాగా జమ్మూకశ్మీర్‌లో గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఎన్‌కౌంటర్. జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అటవీప్రాంతాల్లో అణువణువు జల్లెడపడుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
పహల్గాం నిందితులు, ఉగ్రవాదులను భద్రతాబలగాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ వేటలో భాగంగానే ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. కొన్ని కొత్త ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన చొరబాటు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. ఈరోజు ఉదయం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్ , ట్రాల్ ప్రాంతాల్లో తారసపడ్డారు. భద్రతాబలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతాబలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు సమాచారం. మరో ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయి. అవంతిపొరాలో ఎదురుకాల్పులపై కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఆరా తీసింది.
కాగా.. రెండు రోజుల క్రితం కూడా షోపియాన్ ప్రాంతంలో జిన్‌పాథర్ కెల్లర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కెల్లార్ పేరుతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు హతమవడంతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేస్తున్నారు. అంతేకాకుండా మందుగుండు సామాగ్రిని కూడా భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవాలనే సంకల్పంతో భద్రతాబలగాలు ముందుకు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
2 Women Marry: ఎంత మోసపోతే మాత్రం.. ఇలా ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా..
Read Latest National News And Telugu News