ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PMSHRI Scheme: పిఎమ్ఎస్‌హెచ్‌ఆర్‌ఐ పథకం కింద రాష్ట్రానికి మరిన్ని పాఠశాలలు: కేంద్ర మంత్రి

ABN, Publish Date - Jul 21 , 2025 | 04:39 PM

రాష్ట్రంలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోపాఠశాలల ఏర్పాటుపై విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ లోక్‌సభలో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి స్పందిస్తూ.. రాతపూర్వక సమాధాన మిచ్చారు.

Central Minister Jayant Chaudhary

న్యూఢిల్లీ, జులై 21: ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎమ్ఎస్‌హెచ్‌ఆర్ఐ) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పాఠశాలలు చేర్చే అవకాశముందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 953 పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. ఆ జాబితాలో ఎన్టీఆర్ జిల్లాలో 29 పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. అందుకోసం రూ. 1620.6 లక్షలు వినియోగిస్తామన్నారు. ఛాలెంజింగ్ మెథడ్‌లో భాగంగా ఏడు దశల్లో 935 పాఠశాలలు ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి చెప్పారు.

రాష్ట్రంలో పీఎమ్‌ఎస్ఆర్‌ఐ పథకం కింద జిల్లాల వారీగా అభివృద్ధి కోసం ఎంపిక చేసిన పాఠశాలల సంఖ్య, నిర్మించాల్సిన సదుపాయాలు, నిధుల కేటాయింపుతోపాటు ఈ పథకంలో మరిన్ని పాఠశాలలు చేర్చే అవకాశం ఉందా? అనే అంశాలు తెలియజేయాలంటూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి రాత పూర్వకంగా సమాధానమిచ్చారు.

రాష్ట్రంలో ప్రధాన్ మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథ‌కం కింద అత్యధికంగా కర్నూలు జిల్లాలో 54 పాఠశాలలు, విశాఖపట్నంలో కేవలం 6 పాఠశాలలు మాత్రమే ఎంపికైన‌ట్లు ఆయన గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో ఈ ప‌థ‌కం కింద 29 పాఠశాలలు ఎంపిక కాగా.. ఈ పాఠ‌శాల‌ల కోసం రూ.3,404.1 ల‌క్ష‌లు నిధుల‌ కేటాయించామని చెప్పారు. అందులోభాగంగా రూ.1628.2 లక్ష‌లు నిధులు విడుద‌ల చేసి.. రూ.1620.6 లక్ష‌లు వినియోగించిన‌ట్లు తెలిపారు.

ఈ పాఠశాలల అభివృద్ధిలో ప్రధానంగా సైన్స్ ల్యాబ్స్, స్మార్ట్ తరగతులు, డిజిటల్ బోర్డులు, LED లైటింగ్, గ్రంధాలయాలు, ఆటల మైదానాలతోపాటు ‘గ్రీన్ స్కూల్స్’ లక్ష్యంగా ఉన్నాయని విద్యా శాఖ సహాయ మంత్రి తెలిపారు. అలాగే జాతీయ విద్యా విధానం – 2020లో పేర్కొన్న అన్ని అంశాలను ఆచరణలో పెట్టే విధంగా ఈ పాఠశాలలు తీర్చిదిద్దబడుతున్నాయని పేర్కొంది. పారదర్శక పోటీ పద్ధతిలో ఎంపిక చేసిన ఈ పాఠశాలల్లో విద్యార్థులకు సమాన అవకాశాలు, ఆధునిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

ఈ పాఠశాలలు.. విద్యార్థులకు కేవలం పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా సమగ్ర వ్యక్తిత్వ అభివృద్ధితో పాటు నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తాయని స్పష్టం చేశారు. ఈ పాఠ‌శాల‌ల్లో స్మార్ట్ క్లాస్ ‌రూములు, సైన్స్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీలు, ఎల్.ఈ.డి లైటింగ్, ఔషధ తోటలు, గ్రీన్ కంపోస్టింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు ఆధునిక విద్యను అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పారదర్శక పోటీ పద్ధతిలో ఈ పాఠశాలల ఎంపిక జ‌రిగిన‌ట్లు తెలిపారు. ఈ పాఠ‌శాల‌ల‌కు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల‌ను గుర్తించి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పిస్తుందని.. ఆ ప్రతిపాదనలను ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఆమోదిస్తుందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 05:50 PM