ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ఆ రెండు దేశాలు సహకార స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవాలి...

ABN, Publish Date - May 05 , 2025 | 02:03 PM

AP Deputy CM Pawan Kalyan: భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో సమస్యలను పరిష్కరించడానికి.. నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

AP Deputy CM Pawan Kalyan

అమరావతి: ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడు (Tamilnadu)కు చెందిన 24 మంది భారతీయ మత్స్యకారులకు సంబంధించిన (Fishermen Issues) సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత (Janasena Chief), ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media) ట్విట్టర్ (Twitter) వేదికగా పోస్టు చేశారు. ‘‘నాగపట్నం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గాయపడ్డారని తెలుసుకోవడం బాధాకరం, భారతదేశం.. శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా, పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించి, ఈ పునరావృత పరిస్థితులను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’’ అని పోస్టు చేశారు. భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


అమరావతే అవకాశాల రాజధానిగా నిలుస్తుంది..

‘‘కాగా రాజధాని అమరావతి ప్రపంచస్థాయి, సర్వశ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుంది. కేవలం ఆర్కిటెక్చర్‌, కాంక్రీట్‌ జంగిల్‌లా కాకుండా... జవాబుదారీతనానికి, న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతారు. మన యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... అమరావతే అవకాశాల రాజధానిగా నిలుస్తుంది’’... అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు, జగన్‌ హయాంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు.

Also Read: అవి సాధారణ మరణాలు కావు.. ప్రభుత్వ హత్యలే..


నాడు చెప్పాం.. నేడు చేస్తున్నాం...

అప్పట్లో దివి సీమ తుఫాను వచ్చి అందరి ఆశలు తుడిచిపెట్టినట్లు... గత ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్‌ 30, సెక్షన్‌ 144 మాత్రమే గుర్తుకు వచ్చేలా చేసింది. రాజధాని కోసం 34వేల ఎకరాలు ఇచ్చిన 29వేల పైచిలుకు రైతులు గత ఐదేళ్లు నలిగిపోయారు. రోడ్ల మీదకు వచ్చారు. ముళ్ల కంచెల మధ్య కూర్చున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు. కేసులు ఎదుర్కొన్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సమయంలో... తమ కన్నీళ్లు తుడిచే వారు ఉన్నారా... మా కష్టాలు ప్రధాని మోదీకి తెలుస్తాయా అని నన్ను అప్పట్లో అడిగారు. మోదీకి తెలియకుండా ఏదీ ఉండదు... అమరావతే శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆనాడే మాట ఇచ్చాం. గత ప్రభుత్వం ఈ త్యాగాన్ని అవమానించిందని పవన్ కల్యాణ్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది..

కౌలు రైతులకు శుభవార్త..

అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు..

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 02:03 PM