Paka Satyanarayana: రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - May 28 , 2025 | 03:42 PM
Paka Satyanarayana: రాజ్యసభ్యుడిగా పాక సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా పాక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ, మే 28: రాజ్యసభ సభ్యుడిగా పాక వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం సత్యనారాయణ చేత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ (Vice President Jagdeep Dhankhar) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, ఎంపీ లక్ష్మణ్, ఏపీ మంత్రి సత్య కుమార్ హాజరయ్యారు. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీ స్థానానికి పాక సత్యనారాయణ అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా పాక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2028 వరకు సత్యనారాయణ పదవిలో కొనసాగనున్నారు.
1961లో ఏపీలోని భీమవరంలో పాక సత్యనారాయణ జన్మించారు. 15ఏళ్ల వయస్సులోనే అంటే 1976లో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో పాక సత్యానారాయణ క్రియాశీలకంగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన పాక.. ఆ తరవాత భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో నరసాపూర్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2006 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2006 నుంచి 2010 వరకు భీమవరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే 2012 నుంచి 2018 వరకు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే 2014లో ఉమ్మడి ఏపీ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2018 నుంచి 2021 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా పాక సత్యనారాయణ పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఇక.. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి ప్రభుత్వం పాక సత్యనారాయణను నామినేట్ చేసింది. 2025, మే 6న ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా పాక సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇవి కూడా చదవండి
మహానాడు వేదికగా వారికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
Read Latest AP News And Telugu News
Updated Date - May 28 , 2025 | 04:04 PM