CM Chandrababu Congrats Neeraj: నీ విజయం దేశానికే గర్వకారణం.. నీరజ్‌పై సీఎం ప్రశంసల జల్లు
ABN, Publish Date - May 17 , 2025 | 12:08 PM
CM Chandrababu Congrats Neeraj: దోహా డైమండ్ లీగ్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ ఘనత సాధించినందుకు నీరజ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అమరావతి, మే 17: ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ టోర్నీలో 90 మీటర్ల జావెలిన్ విసిరి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రాకు (Javelin Throw Star Neeraj Chopra) కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణం అంటూ ప్రధాన నరేంద్ర మోదీ (PM Modi) సహా రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నీరజ్ చోప్రా విజయంపై స్పందించారు. ఇంతటి ఘనత సాధించిన నీరజ్‌కు హృదపూర్వక అభినందనలు తెలిజేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్
నీరజ్ చోప్రా మరోసారి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించారు. 90 మీటర్ల మార్కు కంటే ఎక్కువ దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్ విసిరి దేశం గర్వించేలా చేశారు. నీరజ్‌కు ఈ ఘనత సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. ఈ మైలు రాయిని దాటడం ద్వారా భారత్ క్రీడా ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. నీరజ్ సాధించిన విజయం దేశానికే గర్వకారణం అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
కాగా.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న లక్ష్యాన్ని చేధించాడు జావెలిన్ త్రో స్టార్ నీజర్ చోప్రా. దోహాలో జరిగిన డైమండ్ లీగ్ టోర్నీలో జావలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరి చరిత్రలో నిలిచాడు. తొలి ప్రయత్నంలోనే ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరిన నీరజ్.. ప్రధాన ప్రత్యర్థులు అండర్సన్ పీటర్స్, జులియన్ వెబర్‌లకు గట్టి పోటీని ఇచ్చాడు. రెండో రౌండ్‌లో ఫౌల్ చేసిన భారత్ జావెలిన్ త్రో స్టార్.. మూడో రౌండ్‌లో మాత్రం ఏకంగా 90.3 మీటర్ల దూరంలో ఈటెను విసిరి అరుదైన మైలు రాయిని చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Kakani Govardhan Reddy: తప్పుదారి పట్టిస్తారా
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Read Latest AP News And Telugu News
Updated Date - May 17 , 2025 | 02:41 PM