Kakani Bail Rejected: కాకాణి ముందస్తు బెయిల్.. కరుణించని సుప్రీం
ABN, Publish Date - May 16 , 2025 | 01:12 PM
Kakani Bail Rejected: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాణి సుప్రీంలో పిటిషన్ వేశారు.
న్యూఢిల్లీ, మే 16: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి (Former Minister Kakani Goverdhan Reddy) సుప్రీం కోర్టులో(Supreme Cour) ఊరట దక్కలేదు. కాకాణి ముందస్తు బెయిల్‌కు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ1గా ఉన్నారు. దాదాపు రెండు నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలోనూ ఏపీ హైకోర్టులో (AP High Court) ముందస్తు బెయిల్ కోసం కాకాణి పిటిషన్ వేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
దీంతో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. ఈరోజు (శుక్రవారం) విచారణకు వచ్చింది. కాకాణి తరఫున ప్రముఖ న్యాయవాది, మాజీ హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడు, అభినవ్ వాదనలు వినిపించారు. అయితే సుప్రీం కోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కాకాణి తరుపు న్యాయవాదులు బ్రతిమిలాడినప్పటికీ సుప్రీం ధర్మాసనం కరుణించలేదు.
New Covid-19: వామ్మో.. మళ్లీ ఎంటరైన కొత్త కరోనా.. ఆ దేశాల్లో మరీ దారుణంగా..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 వరకు క్వార్డ్జ్ అక్రమ తవ్వకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. క్వార్డ్జ్ అక్రమాల్లో కాకాణి హస్తం ఉందంటూ అప్పట్లోనే మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే పదే ఆరోపించారు. సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తామని నేరుగా మైనింగ్ వద్దకు కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కాకాణిపై కేసు నమోదు అవడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పలు మార్లు నోటీసులు ఇచ్చారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం చూడగా నిరాశే ఎదురైంది. దీంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కాకాణి. కానీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కాకాణి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారు. చివరకు సుప్రీంలో ముందస్తు బెయిల్ పొందేందుకు యత్నించినప్పటికీ అక్కడ కూడా కాకాణికి ఉపశమనం లభించలేదు. కాకాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఇక ఆయన అరెస్ట్ తప్పదనేది స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి
SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్
Tirumala Donations: గోవిందుడికి భారీ కానుక
Read Latest AP News And Telugu News
Updated Date - May 16 , 2025 | 02:59 PM