ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PSR Remand: ఆ కేసులో పీఎస్సార్‌ మళ్లీ జైలుకే

ABN, Publish Date - May 22 , 2025 | 01:57 PM

PSR Remand: ఏపీపీఎస్సీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజేయులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నేటితో రిమాండ్ ముగియడంతో పీఎస్సార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

PSR Remand extended

విజయవాడ, మే 22: ఏపీపీఎస్సీ (APPSC) అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులును (PSR Anjneyulu) పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో పీఎస్సార్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చగా.. జూన్ 5 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పీఎస్సార్, ధాత్రి మధును ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది.


కాగా.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలలో పేపర్ మూల్యాంకనంలో అవకతవలకు సంబంధించిన కేసులో పీఎస్సార్‌పై పోలీసులు పీటీ వారంట్‌పై అదుపులోకి తీసుకుని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. 2018-2019 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పీఎస్సార్ పనిచేసినప్పుడు గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీ అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం అయ్యాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏప్రిల్ 29న పీఎస్సార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీఎస్సార్ ఏ1గా, ధాత్రి మధు ఏ2గా ఉన్నారు. ఈ కేసులో పీఎస్సార్‌ను తొలుత కోర్టులో హాజరుపర్చగా నేటి వరకు రిమాండ్ విధించింది. ఈరోజుతో రిమాండ్ ముగియడంతో మరోసారి ఆయనను కోర్టులో హాజరుపర్చగా... మరోసారి ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా.. ఈ కేసులో బెయిల్‌ ఇవ్వాల్సిందిగా విజయవాడ కోర్టులో పీఎస్సార్‌ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.


మరోవైపు ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో కూడా పీఎస్సార్‌ ఆంజనేయులు అరెస్ట్ అయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో పీఎస్సార్‌కు న్యాయస్థానం బెయిల్ ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి

ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ

కీలక దశకు మిస్‌వరల్డ్‌ పోటీలు

Read latest AP News And Telugu News

Updated Date - May 22 , 2025 | 02:37 PM