Supreme Court: సుప్రీంకు డాక్టర్ ప్రభావతి...హైకోర్టు ఉత్తుర్వులపై స్టే
ABN, Publish Date - Jan 31 , 2025 | 11:38 AM
Supreme Court: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.
అమరావతి, జనవరి 31: ఏపీ డిప్యూటీ స్పీకర్, అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు (AP Deputy Speaker Raghurama Krishnam Raju) కస్టోడీయల్ టార్చర్ వ్యవహారంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి సుప్రీంలో (supreme Court) కాస్త ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై ఏపీ హైకోర్టు (AP High court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభావతి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈరోజు (శుక్రవారం) ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. విచారణకు సహకరించాలని డాక్టర్ ప్రభావతికి ఆదేశించింది. డాక్టర్ ప్రభావతి పిటీషన్‌పై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా.. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసి విషయం తెలిసిందే. దర్యాప్తు దశలో కేసు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని న్యాయస్థానం స్పష్టం చేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు. అయితే డాక్టర్ ప్రభావతి నివేదికలు మార్చేశారు. రఘురామకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారు ప్రభావతి. అయితే ఈ కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీంతో కేసులో ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
బడ్జెట్‌పై రాష్ట్రపతి కీలక ప్రసంగం..
అయితే ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో కూడా పలు దఫాలుగా వాదనలు జరుగగా.. చివరకు కేసు దర్యాప్తు దశలో ఉన్నందుకు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ ఆ కేసును కొట్టేసింది హైకోర్టు. అలాగే ఇదే కేసులో అప్పట్లో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న విజయ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అలాగే ఈ కేసులోనే అప్పట్లో రఘురామ కృష్ణం రాజు గుండెపై కూర్చుని పిడిగుద్దులు గుద్దారని, హత్యాయత్నానికి పాల్పడ్డారని గుడివాడకు చెందిన కామేపల్లి తులసిబాబు కూడా అరెస్ట్ అయి జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీంద్రారెడ్డి కేసు
Online Game: ఆన్‌లైన్ గేమ్ ఎంతపని చేసిందంటే.. చివరకు కన్నతల్లిని కూడా
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 31 , 2025 | 11:56 AM