Varra Ravinder Case: పులివెందులకు వర్రా రవీందర్ రెడ్డి కేసు
ABN , Publish Date - Jan 31 , 2025 | 10:30 AM
Varra Ravinder Case: వైసీపీ నేత వర్రావవీందర్ రెడ్డి కేసులపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను చంపేస్తారంటూ బెదిరింపులకు దిగితూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రాపై వైఎస్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్, జనవరి 31: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి (YSRCP social media activist Varra Ravinder Reddy) కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ నుంచి పులివెందులకు వర్రా రవీందర్ కేసు బదిలీ అయ్యింది. వర్రా రవీందర్ రెడ్డిపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత (YS Sunita) పెట్టిన కేసు ప్రస్తుతం పులివెందులకు బదిలీ అయ్యింది. గత ఏడాది ఫిబ్రవరిలో సునీతను చంపుతామంటూ బెదిరించడం, వ్యక్తిత్వ హననం చేస్తూ అసభ్యంగా వర్రా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో గతంలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేసింది. సునీత ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసును పులివెందులకు బదిలీ చేశారు పోలీసులు. దీంతో పులివెందుల పోలీసులు వర్రా రవీందర్రెడ్డిపై కొత్తగా కేసు నమోదు చేశారు. వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న వర్రా కడప సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగాఉన్నాడు.
వర్రాపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును పులివెందులకు బదిలీ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో సునీత, వారి కుటుంబసభ్యులను బెదిరింపులకు దిగుతూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు వర్రా. సునీతను చంపుతామంటూ బెదిరించడంతో పాటు వ్యక్తిగత హననం చేస్తూ అసభ్యంగా పోస్టులు పెట్టడంతో సునీత సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆధారాలను పరిశీలించిన పోలీసులు అప్పట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పులివెందుల పోలీసులు వైసీపీ నేతపై కొత్త కేసును నమోదు చేశారు. వర్రాపై గతంలో చాలా కేసులు నమోదు అవడంతో అతడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వర్రాను విచారణ జరపాలని పులివెందుల పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ నుంచి బదిలీ అయిన ఈ కేసును పులివెందుల పోలీసులు పరిశీలించిన తరువాత కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Police: పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్‌ఐ ఆత్మహత్య.. ఎందుకంటే
Read Latest AP News And Telugu News