ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cognizant IT Campus: ఏపీకి కాగ్నిజెంట్..

ABN, Publish Date - Jun 20 , 2025 | 01:23 PM

Cognizant IT Campus: ఏపీలో మరో ఐటీ దిగ్గజం కంపెనీని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ కంపెనీకి తక్కువ ధరకే భూమిని కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Cognizant IT Campus

అమరావతి, జూన్ 20: ఏపీలో మరో దిగ్గజ ఐటీ కంపెనీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.1,582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ (Cognizant Tech Solutions) ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో దాదాపు 8000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఏపీలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు మంత్రి నారా లోకేష్‌ ముందు (Minister Nara lokesh) కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ కంపెనీకి ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచ స్థాయి ఐటీ/ ఐటీఈఎస్ క్యాంపస్‌ను స్థాపించడానికి సిద్ధంగా ఉన్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది.

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) కింద కాపుల ఉప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమిని కావాలని కాగ్నిజెంట్ కోరింది. ఐటీ పెట్టుబడుల అభివృద్ధి కేంద్రంగా వైజాగ్‌కు కాగ్నిజెంట్ రావటం గొప్ప మైలురాయిగా లోకేష్ అభివర్ణించారు. 2029 మార్చి నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి కాగ్నిజెంట్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని సమాచారం.

మరోవైపు విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో దిగ్గజ సంస్థలు అక్కడ కంపెనీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తోంది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా ఇటీవల టీసీఎస్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం భూమిని కేటాయించింది. టీసీఎస్‌కు రుషికొండలో 21.6 ఎకరాలను కేటాయించింది. ఎకరాకు నామమాత్రంగా 99 పైసలకే లీజు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో టీసీఎస్‌ రూ. 1,370 కోట్లు పెట్టుబడిగా పెట్టబోతోంది. దీని ద్వారా 12 వేల నుంచి 15వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మా ప్రస్తావన అనవసరం.. జగన్‌పై కమ్మ సంఘాల ఆగ్రహం

నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ.. నిలిచిన విమానం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 03:17 PM