Share News

Kamma Community Slams Jagan: మా ప్రస్తావన అనవసరం.. జగన్‌పై కమ్మ సంఘాల ఆగ్రహం

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:53 PM

Kamma Community Slams Jagan: ఓదార్పు యాత్రలో నరికేస్తాం అని వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించలేదని.. పైగా ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారని కమ్మ సంఘాల నేతలు మండిపడ్డారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలని, మతాలు కులాలు మధ్య విద్వేషాలు సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

Kamma Community Slams Jagan: మా ప్రస్తావన అనవసరం.. జగన్‌పై కమ్మ సంఘాల ఆగ్రహం
Kamma Community Slams Jagan

విజయవాడ, జూన్ 20: కమ్మవారు ఒక పార్టీలోనే ఉండాలా అంటూ ఇటీవల మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలను కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ కమ్మ సంఘాలు ఖండించాయి. ఈరోజు (శుక్రవారం) కమ్మ వారి సేవా సమితి ఉపాధ్యక్షులు గుమ్మడి రామకృష్ణ మాట్లాడుతూ.. కమ్మ వారు అన్ని పార్టీల్లో ఉన్నారని.. వైసీపీ పార్టీలో కూడా ఉన్నారన్నారు. ఓదార్పు యాత్రలో కమ్మ కులం గురించి ప్రస్తావన అనేది అనవసరమైన విషయమన్నారు. కొడాలి నాని లాంటి తమ సామాజిక వర్గం వారితో తమనే తిట్టించారని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిని అసెంబ్లీలో తిట్టించారన్నారు. అమరావతిని కమ్మరావతి అన్నారని.. అధికారులకు కులాలను ఆపాదించి అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘రాజకీయాలు మాట్లాడుకోండి అంతే కానీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు’ అంటూ హితవుపలికారు. ఓదార్పు యాత్రలో నరికేస్తాం అని వ్యాఖ్యలు చేసిన వారిని ఖండించలేదని.. పైగా ఆ వ్యాఖ్యలకు జగన్ సంతోషపడ్డారన్నారు. జగన్ తన విధానాలు మార్చుకోవాలని, మతాలు కులాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం అసంభవమని, ఆయన విధానాలు ఇలానే ఉంటే పొరపాటున కూడా అధికారంలోకి రారని స్పష్టం చేశారు. ప్రజలు జగన్ వస్తున్నారంటేనే భయపడిపోతున్నారన్నారు. అన్ని కులాలను సమానంగా చూడాలని.. అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారని రామకృష్ణ చెప్పుకొచ్చారు.


రాజకీయాల నుంచి బహిష్కరించాలి: సుధాకర్

జగన్ రాజకీయ పర్యటనలో రాజకీయాలు మాట్లాడాలి కానీ ఒక కుల ప్రస్తావన తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నామని కమ్మ సేవా సమితి అధికార ప్రతినిధి పువ్వాడ సుధాకర్ అన్నారు. జగన్ వైఖరిలో మార్పు రాలేదని.. అధికారంలో ఉండగా కమ్మ సామాజికవర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారని ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయడానికి కమ్మవారిపై ఇతర కులాల వారికి విద్వేషాలు కలిగించే వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్ ప్రతీదానికి కమ్మ కులానికి ఆపాదిస్తున్నారన్నారు. ‘నీ కంటే ముందు అనేక రెడ్డి కులస్తులు పరిపాలించినా ఏ ఒక్కరు కూడా కమ్మ కులస్తులను ద్వేషించలేదు. సమాజ సేవకై కమ్మ కులస్తులు కట్టుబడి ఉన్నారు. పద్ధతి ప్రకారం ప్రమోషన్స్‌ రావాల్సిన కమ్మ అధికారులను మీరు ఏ విధంగా అడ్డుకున్నారో అందరికీ తెలుసు. సమాజంలో ద్వేషాలు కులాల మధ్య చిచ్చు పెట్టేలా చేసేవారిని రాజకీయాల నుంచి బహిష్కరించాలి’ అని సుధాకర్ డిమాండ్ చేశారు.


జగన్ పరామర్శ ఉద్దేశం అదే: స్వరూప రాణి

జగన్‌మోహన్ రెడ్డి పరామర్శ ఉద్దేశం ప్రజలను రెచ్చగొట్టడమే అని కమ్మ సేవా సమితి ప్రతినిధి సూరపనేని స్వరూప రాణి అన్నారు. పోలీసుల సూచనలు పాటించకుండా వందల మందిని పోగు చేయడం, ప్రజలను పోలీసులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇటువంటి వాటిపై ఏం చేయాలో భవిష్యత్తులో సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెంటపాళ్ల పర్యటనలో 2029లో అధికారంలోకి వస్తే అందరినీ నరుకుతామని ప్లకార్డులు ప్రదర్శించారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రెంటపాళ్లలో వైసీపీ వ్యవహారశైలిని సీఎం చంద్రబాబు ఖండిస్తే.. అందులో తప్పేముందని జగన్ మాట్లాడుతున్నారన్నారు. ఇటువంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కమ్మ సామాజికవర్గాన్ని అవమానించకుండా చూడాలనేది కమ్మ వారి సేవా సమాఖ్య ప్రధాన డిమాండ్ అని స్వరూప రాణి చెప్పుకొచ్చారు. ‘జగన్మోహన్ రెడ్డి మీ పార్టీలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కమ్మ వారికి ఇవ్వగలరా?, వైసీపీ ప్రభుత్వంలో కమ్మవారికి ఒక్క మంత్రి పదవి అయినా ఇచ్చారా?. అందరినీ సమానంగా చూడాలి’ అని ముత్తవరపు రామకృష్ణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ.. నిలిచిన విమానం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 01:36 PM