Share News

BJP vs YCP: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హాట్ కామెంట్స్..

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:34 PM

BJP vs YCP:బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన విషయాన్ని మరిచిపోయి.. ప్రధాని మోదీ ఏపీకి రావడానికి ముందు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే విషప్రచారం చేయాలని చూశారని మండిపడ్డారు.

BJP vs YCP: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హాట్ కామెంట్స్..
Bhanuprakash Reddy comments

Nellore: వైసీపీ అధ్యక్షుడు (YCP Chief), మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (Ex CM Jagan)పై బీజేపీ నేత (BJP Leader) భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) హాట్ కామెంట్స్ (Comments) చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం ఆయన నెల్లూరు (Nellore)లో మీడియాతో మాట్లాడారు. జగన్ బయటకు రావడానికి ముందు ‘ఒక శవం లేవాలి.. వస్తే రెండు శవాలు లేవాలి’ అంటూ విమర్శలు చేశారు. వైసీపీ నేతలు (YCP Leaders) గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిన ఘనులని.. కొబ్బరిబోండాలు నరుక్కోడానికి, పరోటా పిండి పిసుక్కోవడానికే వారి శేష జీవితం సరిపోతుందని ఎద్దేవా చేశారు.


జగన్.. సిగ్గుండాలి...

జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి... ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారని, ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని, ఏదో జరిగిపోతోందనే ప్రచారం తీసుకెళ్లే ప్రయత్నం చేశారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి రచ్చచేసి, ఏమి సాధించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఏపీకి రావడానికి ముందు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందనే విషప్రచారం చేయాలని చూశారని, జగన్ అపరచితుడని ఏపీ ప్రజలు అంటున్నారని.. రాజకీయాలకు అనర్హుడిగా భావిస్తున్నారని ఆయన అన్నారు.


రఫా.. రఫా.. నరికితే తప్పేంటి అంటారా..

రఫా... రఫా.. నరికితే తప్పేంటని అంటారా.. రోజు రోజుకు జగన్ చేష్టలు మితిమీరిపోతున్నాయని, ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత జగన్ మానసిక పరిస్థితి సరిలేదని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా కావాలని, ఏదో చిన్నపిల్లలు చాక్లెట్లు అడిగినట్టు రచ్చ చేశారని దుయ్యబట్టారు. ఏపీని పూర్తిగా అంథకారంగా మార్చిన ఘనత జగన్‌దని అన్నారు. జగన్ చేసిన విధ్వంసం నుంచి వికసిత ఏపీగా మార్చడానికి తమకు ఏడాది సమయం పట్టిందని, వైసీపీకి చరిత్రలో జైళ్లు, ఓదార్పు యాత్రలు తప్పించి విజయోత్సవాలు, జైత్రయాత్రలు ఉండవని ఆయన అన్నారు. జగన్‌ను నమ్మిన నేతలందరినీ నీవు ఎక్కడ ఉండి వచ్చావో.. వారిని అక్కడికే పంపించావని అన్నారు.


చట్టాలను ఎవరు అతిక్రమించినా...

ప్రజల కష్టాలు, ఇష్టాలు తెలుసుకుని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతోందని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. ఎవరు చట్టాలను అతిక్రమించినా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, చట్ట పరిధిలో పోలీసులకుండే అధికారాలతో రౌడీ మూఖల ఆగడాలను అణిచివేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహాకరిస్తుందని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

విద్యార్థిపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వరల్..

రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు బర్త్‌డే శుభాకాంక్షలు

భువనేశ్వరికి చంద్రబాబు బర్త్‌డే విషెస్

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 20 , 2025 | 12:34 PM