ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..

ABN, Publish Date - Mar 10 , 2025 | 01:10 PM

రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని అధికారులను సూచించారు.

CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు (AP Government Schemes), కార్యక్రమాల నిర్వహణపై ఆయా శాఖల మంత్రులు (Ministers), ఉన్నతాధికారులతో (Officers) సోమవారం సమీక్ష నిర్వించారు (Review Meeting). వివిధ పథకాల అమల్లో లబ్దిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో సమీక్ష జరిపారు. ప్రతి వారం నాలుగు శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యమని సూచించారు.

Also Read:

ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్షా..


ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మునిసిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పదే పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని అధికారులను అదేశించారు. కరెప్షన్ అనేది ఒక జబ్బులాంటిదని...దాన్ని పూర్తిగా నివారించాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


బలహీనవర్గాలకు పెద్దపీట..

కాగా బలహీనవర్గాలకు పెద్దపీట.. ప్రాంతాల నడుమ సమతూకం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వీరిలో బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌, కావలి గ్రీష్మ ఉన్నారు.

కలిసొచ్చిన కలుపుగోలు

కావలి నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్రయాదవ్‌ టీడీపీకి తొలినుంచీ విధేయుడిగా ఉంటున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన రవిచంద్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. జిల్లాలో నాయకుల మధ్య ఎన్ని విభేదాలున్నా రవిచంద్ర విషయంలో అందరి నడుమ ఏకాభిప్రాయం ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్లడం.. పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా పనిచేయడం బీద రవిచంద్రను ఎమ్మెల్సీ రేసులో విజయం సాధించేలా చేశాయి. 2015లో ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రవిచంద్రకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.


బలమైన గళం వినిపించేందుకు

పార్టీలో యువరక్తాన్ని తీసుకురావాలన్న ఆలోచనతోపాటు ఎస్సీ మహిళకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో శ్రీకాకుళానికి చెందిన కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. మండలిలో వైసీపీకి ఆధిక్యం ఉండటం.. వారి తరఫున గట్టిగా మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ధీటుగా ఎదుర్కోవాలంటే టీడీపీ నుంచి బలమైన గళాన్ని వినిపించే వారు ఉండాలన్న ఉద్దేశంతో ఫైర్‌ బ్రాండ్‌గా పేరుపొందిన కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. గ్రీష్మ గత ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం టికెట్‌ ఆశించారు. గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులపై గ్రీష్మ విరుచుకుపడిన తీరు.. ఒంగోలులో నిర్వహించిన మహానాడులో వైసీపీ నాయకులను సవాల్‌ చేస్తూ తొడకొట్టిన తీరు ఆమెను పార్టీలో ఫైర్‌ బ్రాండ్‌గా నిలిపాయి. 2017లో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన గ్రీష్మ రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే గ్రీష్మను ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్‌గా నియమించారు. తాజాగా ఆమెకు ఎమ్మెల్సీ అవకాశాన్ని ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..

రోహిత్ శర్మ కీలక ప్రకటన

బోరుగడ్డ కేసు.. క్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 10 , 2025 | 01:10 PM