Crime News:కృష్ణా జిల్లాలో దారుణం...
ABN, Publish Date - May 04 , 2025 | 07:57 AM
కృష్ణ జిల్లా: కృత్తివెన్ను మండలం, మాట్లం గ్రామంలో దారుణం జరిగింది. వృద్ధులని చూడకుండా భార్యా భర్తలను.. నాగరాజు, చింతా వెంకట లక్ష్మి, వారి పిల్లలు వచ్చి కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణ జిల్లా: కృత్తివెన్ను మండలం ( Krittivennu Mandal), మాట్లం గ్రామం (Matlam village)లో దారుణం (violence) జరిగింది. కర్రలతో భార్యా, భర్తలను చితకబాదారు. ఈ ఘనలో తీవ్రంగా గాయపడిన వారిని మచిలీపట్నం ఆసుపత్రికి (Machilipatnam hospital) తరలించారు. వివరాల్లోకి వెళితే.. మాట్లం గ్రామంలోని తిరుమాని జలాచంద్రుడు, ముత్యాలమ్మలకు చెందిన ఇండ్ల స్థలం కోర్టు వివాదంలో ఉంది. (ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది) ఈ స్థలం కోర్టు వివాదంలో ఉండటం, ఆ స్థలం నిరుపయోగంగా ఉండడం వలన అక్కడ చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకు పోయింది. స్థానిక పంచాయతీ సెక్రటరీ ఆదేశాలతో నాలుగు రోజుల క్రితం చెత్తను శుభ్రం చేసి మళ్ళీ ఎవ్వరు వేయకుండా పరదా కట్టరు. ఈ విషయం తెలుసుకున్న వివాదంలోని అవతలి వారు అంకాని నాగరాజు, చింతా వెంకట లక్ష్మి, వారి పిల్లలు వచ్చి స్థలం చుట్టూ కట్టిన పరదాలను తొలగించారు. పరదాలు తొలగించే కార్యక్రమాన్ని సెల్ ఫోనులో రికార్డు చేయడం గమనించి కర్రలతో దాడికి తెగబడి వృద్ధులను చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు టార్గెట్..
కాగా ఒంగోలు సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. కొప్పోలు ప్లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న కారును లారీ ఢీ కొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో చోట ట్రాక్టర్, కారు ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. మరో ప్రాంతంలో అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందారు.ఈ ప్రమాదాలపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయా సంఘటనల ప్రదేశాలకు చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి.. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం
బెంగళూరులో ఫుల్‌టైం.. తాడేపల్లిలో పార్ట్‌టైం..
For More AP News and Telugu News
Updated Date - May 04 , 2025 | 07:57 AM