Share News

Indus Water Treaty: సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం: పాక్ రక్షణ మంత్రి..

ABN , Publish Date - May 04 , 2025 | 05:44 AM

సింధు నది నీటిని మళ్లించేందుకు భారత్‌ చేపడతే ఏ ప్రాజెక్టునైనా కూల్చేస్తామని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ 450 కిలోమీటర్ల శ్రేణి కలిగిన అబ్దాలి క్షిపణిని పరీక్షించింది.

Indus Water Treaty: సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణమైనా ధ్వంసం చేస్తాం: పాక్ రక్షణ మంత్రి..

పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

450 కి.మీ బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించిన పాక్‌

న్యూఢిల్లీ, మే 3: సింధు నది నీటిని మళ్లించేందుకు భారత్‌ నిర్మించే ఏ ప్రాజెక్టునైనా కూల్చివేస్తామని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్‌ హెచ్చరించారు. సింఽధు జలాల ఒప్పందం ప్రకారం తమ దేశానికి నది నీటిలో వాటా ఉందన్నారు. పాకిస్థాన్‌ నీటిని మళ్లించే ఏ ప్రయత్నాన్నైనా దురాక్రమణగా పరిగణిస్తామని పాక్‌ మంత్రి వ్యాఖ్యానించారు. సింఽధు నది పరివాహక ప్రాంతంలో భారత్‌ డ్యామ్‌లు నిర్మించదలిస్తే పాకిస్థాన్‌ ఏ విధంగా స్పందిస్తుందని ఓ ఇంటర్వ్యూలో అగిడిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. మరోవైపు ఇరుదేశాల మఽధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ శనివారం 450 కిలోమీటర్ల పరిధి కలిగిన ఉపరితలం-ఉపరితలం బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. ‘ఎక్సర్‌సైజ్‌ ఇండస్‌’ పేరుతో ఆ దేశం చేపట్టిన సైనిక విన్యాసాల్లో భాగంగా అబ్దాలి ఆయుధ వ్యవస్థగా పిలిచే ఈ క్షిపణి ప్రయోగం చేపట్టారు. ‘బలగాల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించే లక్ష్యం’తో ఈ పరీక్ష చేపట్టినట్లు పాక్‌ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 08:38 AM