AP Liquor Scam Latest Update: లిక్కర్ స్కాం.. జగన్ బ్యాచ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ
ABN, Publish Date - May 05 , 2025 | 01:15 PM
AP Liquor Scam Latest Update: ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ బ్యాచ్‌కు బిగ్‌షాక్ తగిలింది. ఈకేసులో ముందస్తు బెయిల్ కోసం నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ, మే 5: ఏపీ లిక్కర్ స్కామ్‌లో (AP Liquor Scam) జగన్ బ్యాచ్‌కు సుప్రీం కోర్టు (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ముగ్గురిని అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చని చెబుతూ.. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 8కి వాయిదా వేసింది.
ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు కె.ధనంజయ రెడ్డి, పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్స్‌పైన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (సోమవారం) విచారణ జరిపింది. అయితే ఏపీ హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి మధ్యంతర ఉపశమనం కలిగించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎల్లుండి ఏపీ హైకోర్టులో విచారణ ఉన్నందున తాము వెంటనే జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 7న ఏపీ హైకోర్టులో విచారణ ఎలా సాగింది, హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తెలియజేయాలని.. ఆ తరువాత ఈనెల 8న దీనిపై తదుపరి విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు అయినా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉపశమనమైనా కలిగించాలంటూ ముగ్గురు తరపున న్యాయవాదులు కోర్టును కోరారు. కానీ అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 7 వరకు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ధర్మాసనం. అరెస్ట్ చేయబోమంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అయినా స్టేట్‌మెంట్ ఇవ్వాలని ముగ్గురు నిందితుల తరపున న్యాయవాదులు కోరారు.
Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
ఇక రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధి, అధికారాల ప్రకారం కావాలంటే అరెస్ట్ కూడా చేసుకోవచ్చని.. ఆ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని జస్టిస్ పార్థివాలా ఈ సందర్భంగా తెలిపారు. ఎల్లుండి విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది. కేసుకు సంబంధించిన మెరిట్స్‌పై తాము ఎలాంటి కామెంట్ చేయడం లేదని.. నిర్ణయాధికారం హైకోర్టుదే అని సుప్రీం కోర్టు వెల్లడించింది. హైకోర్టులో విచారణ ముగిసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత తదుపరి విచారణ చేపడతామని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే సుప్రీం కోర్టులో దాఖలు చేయాలని పిటిషనర్లకు ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
Read Latest AP News And Telugu News
Updated Date - May 05 , 2025 | 04:28 PM