Hariram ACB Case: హరిరామ్ ఏసీబీ కస్టడీ.. నేడు, రేపు అత్యంత కీలకం
ABN , Publish Date - May 05 , 2025 | 01:04 PM
Hariram ACB Case: హరిరామ్‌ను ఐదురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈరోజు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. అయితే గడిచిన మూడు రోజుల విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్‌ను దాదాపు ఐదు మంది అధికారులు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్, మే 5: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్ట్ మాజీ ఈఎన్‌సీ హరిరామ్ (Former ENC of Kaleshwaram project Hariram) కస్టడీ కొనసాగుతోంది. ఐదురోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు (ACB Officers) నాలుగో రోజు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు వాటి కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాల్లో భాగంగా గుర్తించిన బ్యాంకు లాకర్లు తెరిపించేందుకు చర్యలు ప్రారంభించారు. ఈరోజు బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశం ఉంది. వాటిని తెరిస్తే మరికొన్ని కీలక పత్రాలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లాకర్లలోనూ ఏవైనా ఆస్తుల పత్రాలు లభిస్తే వాటి ఆధారంగా కూడా హరిరామ్‌ను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.
హరిరామ్‌ను ఐదురోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈరోజు నాలుగోరోజు విచారణ కొనసాగుతోంది. అయితే గడిచిన మూడు రోజుల విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్‌ను దాదాపు ఐదు మంది అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు వందల కోట్లు ఆస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఇంకా బినామీ ఆస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం లోగా బ్యాంకు లాకర్లను కూడా తెరిచే అవకాశం ఉంది.
Coconut Water Vs Sugarcane Juice: కొబ్బరి నీళ్లా.. చెరుకు రసమా.. హెల్త్‌కు ఏది బెస్ట్
ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బంగారం, ఇతరత్రా కీలకమైన డాక్యుమెంట్లు దొరికితే వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది. కొండాపూర్, మాధాపూర్, శివారు ప్రాంతాల్లో హరిరామ్‌కు సంబంధించిన విల్లాలు ఉన్నట్లు గుర్తించి.. వాటి పత్రాలను సీజ్ చేశారు. మూడు రోజుల విచారణలో ఏసీబీ అధికారులకు హరిరామ్ సహకరించడం లేదని సమాచారం. దీంతో నేడు, రేపటి విచారణ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఈ రెండు రోజుల విచారణ తర్వాత ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి.. రిమాండ్‌కు తరలించే సమయంలో ఎలాంటి కీలక అంశాలు రాబట్టారు అనే విషయాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొనే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం తరువాత హరిరామ్‌ను తీసుకెళ్లి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి అక్కడే విచారణ జరిపే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News