Remand Report: ధనుంజయ్, కృష్ణ మోహన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
ABN, Publish Date - May 17 , 2025 | 03:36 PM
Remand Report: లిక్కర్ స్కాంలో ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించింది సిట్. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఏ1 రాజ్ కసిరెడ్డికి సన్నిహితులని.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో వీరు కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది.
విజయవాడ, మే 17: ఏపీ లిక్కర్ కేసులో (AP Liquor Case) రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు సిట్ (SIT) తెలిపింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్‌గా ఏర్పడ్డారని.. ఈ సిండికేట్‌లో ఉన్నతాధికారులతో పాటు పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నట్లు గుర్తించింది సిట్. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఏ1 రాజ్ కసిరెడ్డికి సన్నిహితులని.. స్కాంలో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనుంజయ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
డిస్టలరీస్ , మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి బదిలీ చేశారని తెలిపింది. లిక్కర్ స్కాంలో ఏ1, ఏ1 సన్నిహితుల నుంచి వసూలు చేసి చివరికు ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందని వెల్లడించింది. సిండికేట్ సభ్యుల సమావేశాల్లో పాల్గొని ముడుపులు సకాలంలో అందేలా చూశారని సిట్ తెలిపింది. ఈ కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి, ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ4 మిథున్ రెడ్డి, ఏ5 విజయ సాయిరెడ్డి, ఏ3 సత్య ప్రసాద్‌లతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొన్నారని.. ఏ1 కసిరెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ముడుపుల వసూలు పరివేక్షించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా
ముడుపుల వసూలుకు వ్యవస్థ సృష్టించి దాన్ని నడిపించారని.. ముడుపులు ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం ఇద్దరి దగ్గర ఉందని తెలిపింది. ముడుపుల డబ్బుతో ఖరీదైన ఆస్తులు, కార్లు కొన్నారని.. ఆ వివరాలు వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. లిక్కర్ స్కాం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని.. అందుకు ఇద్దరిని ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ కోరింది.
అయితే.. ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డిల అరెస్ట్ సంచలనం సృష్టించింది. మద్యం వ్యవహారంలో కేవలం రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారంటూ వాదిస్తూ వస్తోన్న వైసీపీ నాయకులు నోర్లు మూతబడే విధంగా సిట్ అధికారులు కీలకమైన సాక్ష్యాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూనే నడుస్తోంది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ ఏడుగురిలో ఆరుగురు నేరుగా కసిరెడ్డితో సంబంధాలు ఉన్నవారుగా సిట్ గుర్తించింది. ఇక ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను నిన్న(శుక్రవారం) సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) వీరిరువురిని వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. రిమాండ్‌కు సంబంధించి ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను సిట్ అధికారులు పొందుపర్చారు.
ఇవి కూడా చదవండి
CM Chandrababu Congrats Neeraj: నీ విజయం దేశానికే గర్వకారణం.. నీరజ్‌పై సీఎం ప్రశంసల జల్లు
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Read Latest AP News And Telugu News
Updated Date - May 17 , 2025 | 03:42 PM