ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kodumuru Police: వీర జవాన్ల మాతృమూర్తులకు పోలీసుల పాదసేవ

ABN, Publish Date - May 11 , 2025 | 04:42 AM

కోడుమూరు పోలీసులపై దేశభక్తి చూపిన సైనికుల తల్లులకు ఘనంగా సన్మానం. వీర జవాన్ల మాతృమూర్తుల పాదసేవ చేస్తూ, వారి త్యాగాన్ని కీర్తించారు.

  • కాళ్లు కడిగి సెల్యూట్‌ చేసిన కోడుమూరు సీఐ, ఎస్‌ఐ

కోడుమూరు, మే 10(ఆంధ్రజ్యోతి): దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాటం చేస్తున్న సైనికుల తల్లిదండ్రులను కర్నూలు జిల్లా కోడుమూరు పోలీసులు ఘనంగా సన్మానించారు. కోడుమూరుకు చెందిన జవాన్లు సునీల్‌బాబు, వినోద్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారు. మరో జవాన్‌ సునీల్‌ తన సెలవులు రద్దు చేసుకుని యుద్ధ క్షేత్రానికి బయలుదేరి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్‌ శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆ జవాన్ల తల్లిదండ్రులకు శాలువా కప్పి, సెల్యూట్‌ చేశారు. సీఐ తబ్రేజ్‌, ఎస్‌ఐ ఎర్రిస్వామి ఆ ముగ్గురు జవాన్ల మాతృమూర్తులు ఆదిలక్ష్మి, నాగమణి, లక్ష్మిదేవి పాదాల ను కడిగి పాదసేవ చేశారు.

Updated Date - May 11 , 2025 | 04:42 AM