ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మన సీఎం... విజనరీ లీడర్‌: విప్‌ మాధవి

ABN, Publish Date - May 30 , 2025 | 03:11 AM

కడపలో మహానాడు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఆర్. మాధవి తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి రూ.90 కోట్లు విడుదల చేసిన ఆయన కృషిని ప్రశంసించారు.

కడప, మే 29(ఆంధ్రజ్యోతి): మన సీఎం చంద్రబాబు విజన్‌ ఉన్న లీడర్‌ అని ప్రభుత్వ విప్‌, కడప ఎమ్మెల్యే ఆర్‌.మాధవి పేర్కొన్నారు. గురువారం మహానాడు బహిరంగ సభ వేదికపై ఆమె ప్రసంగించారు. ‘43 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి కడపలో మహానాడు నిర్వహించుకునే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు. చివరి రోజు బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారంటే మన కార్యకర్తల బలం ఇట్టే అర్థమవుతుంది. కడప మహానాడు విజయవంతమవడానికి కష్టపడిన అందరికీ కృతజ్ఞతలు. మహిళా సాధికారతకు టీడీపీ ఎప్పుడూ కృషిచేస్తూనే ఉంటుంది. రాయలసీమ కోసం ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగు గంగను తీసుకొచ్చారు. నేడు చంద్రబాబు ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌ ఆధునీకరణ చేపట్టి తాగు, సాగునీరు అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలను నెరవేర్చే నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు. కడప అభివృద్ధి పనులకు రూ.90 కోట్లు నిధులు విడుదల చేశారు.’ అని ఆమె చెప్పారు.

Updated Date - May 30 , 2025 | 03:14 AM