ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan Mohan Reddy: రప్పా రప్పా.. తప్పేందప్పా

ABN, Publish Date - Jul 17 , 2025 | 03:22 AM

సినిమాల్లో చూపించినవి బయటా చేయొచ్చు. సినిమాలో అన్న మాటలు బయటా అనొచ్చు.

YS Jagan
  • సినిమా డైలాగులు పోస్టరుగా వేస్తే తప్పా?

  • మరోసారి సమర్థించిన వైఎస్‌ జగన్‌

  • మరోసారి సమర్థించిన వైఎస్‌ జగన్‌

  • డీఐజీలు మాఫియా డాన్‌లుగా మారారు

  • డీఎస్పీలు, సీఐలతో డబ్బు వసూళ్లు

  • ఎమ్మెల్యేలు, పెద్దబాబు, చినబాబుకు వాటాలు

  • పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర ఆరోపణలు

  • టీడీపీ సైకోలు, శాడిస్టులు అని వ్యాఖ్యలు

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ‘సినిమాల్లో చూపించినవి బయటా చేయొచ్చు. సినిమాలో అన్న మాటలు బయటా అనొచ్చు. సినిమాలకూ, నిజ జీవితానికీ తేడా లేదు!’... ఇది వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభిప్రాయం! ‘రప్పా రప్పా నరుకుతాం’ అనేది సినిమా డైలాగ్‌ కాబట్టి... దానిని బయట పోస్టర్లుగా వేసినా తప్పులేదని ఆయన నొక్కి వక్కాణించారు. ‘మేం అధికారంలోకి రాగానే రప్పా రప్పా నరుకుతాం’ అని వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆయన మరోసారి సమర్థించారు. అందుకు... అర్థంలేని పోలికలు తెచ్చారు. బుధవారం తాడేపల్లిలో ఎప్పట్లాగానే ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

‘‘సినిమా డైలాగును పోస్టరుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండుకు పంపారు. అంత కష్టంగా ఉంటే ఆ డైలాగులను సెన్సార్‌ వాళ్లు ఎందుకు పెట్టాలి? బాలకృష్ణ, పవన్‌ సినిమాల్లో ఇంకా దారుణమైన డైలాగులున్నాయట. డైలాగులు నచ్చకపోతే వాటిని సెన్సార్‌లో తీసేయండి. సెన్సార్‌ బోర్డు ఉండేది ఎందుకు? సినిమా రిలీజ్‌ అయ్యాక వాటి డైలాగులు, మంచి పాటలు సహజంగానే ప్రసిద్ధి చెందుతాయి. మంచి పాట పాడినా తప్పేనట. నచ్చిన డైలాగులు పోస్టరుగా పెట్టినా, మాట్లాడినా తప్పే! మరి... సినిమాలు ఎందుకు తీస్తున్నారు? ఆపేసేయండి’’ అని జగన్‌ తనదైన శైలిలో సూచించారు. ఇక... డీఐజీలు మాఫియా డాన్‌లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన కింద డీఎస్పీ, సీఐలే ఆర్మీగా పేర్కొన్నారు. వారి జోన్‌లో లిక్కర్‌ అమ్మాలన్నా, బెల్టు షాపులు నిర్వహించాలన్నా, ఇసుక తవ్వాలన్నా, మట్టి ఎత్తుకెళ్లాలన్నా డబ్బులు వసూలు చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముట్ట జెప్పుతున్నారన్నారు.

సగం వీళ్లకు... సగం పెద్దబాబుకు, చిన్నబాబుకు వాటాలుగా వెళ్తున్నాయని ఆరోపించారు. ఇవన్నీ చూసి భరించలేక సిద్ధార్థ కౌశల్‌ వంటి కొందరు ఐపీఎస్‌ అధికారులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. బడా కార్పొరేట్‌ సంస్థలో మెరుగైన జీతంతో ఉద్యోగంలో చేరేందుకు, కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేందుకే తాను రాజీనామా చేసినట్లు సిద్ధార్థ కౌశల్‌ ఇదివరకే స్పష్టం చేసినా సరే... జగన్‌ దీనిని వక్రీకరించారు. తాను సీఎంగా ఉండగా పోలీసు వ్యవస్థ తలెత్తుకు తిరిగేలా ఉండేదని... ఇప్పుడు సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తోందని జగన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాట వినలేదని డీజీ స్థాయిలో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారన్నారు.

మరో డీజీ స్థాయి అధికారి సునీల్‌కుమార్‌ను, మరో అడిషనల్‌ డీజీ సంజయ్‌ను, ఐజీ కాంతిరాణా తాతాను, డీఐజీ విశాల్‌ గున్నీలపై తప్పుడు కేసులు పెట్టారని జగన్‌ ఆరోపించారు. ఆయనహయాంలో అడ్డగోలు పనులు చేసినందుకే వీరంతా కేసుల్లో ఇరుక్కున్నారన్నది అసలు నిజం. కానీ... ఆ విషయాన్ని దాచేసి, మాట వినని ఐపీఎ్‌సలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందనేలా జగన్‌ మాట్లాడటం గమనార్హం. గుడివాడలో కృష్ణా జడ్పీ చైర్‌పర్సన్‌ హారికపై టీడీపీ సైకోలు, శాడిస్టులు కర్రలతో, రాళ్లతో దాడి చేయడం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. చంద్రబాబు లైవ్‌ యాక్షన్‌ ముందు ఎన్టీఆర్‌ ఎక్కడికో వెళ్లిపోవాలన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 09:26 AM