ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jagan politics: జగన్‌వి శవ రాజకీయాలు

ABN, Publish Date - Jun 19 , 2025 | 05:16 AM

జగన్‌ శవ రాజకీయాలు చేస్తూ తాజాగా ఇద్దరి మరణానికి కారణమయ్యారని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు.

  • మంత్రులు నిమ్మల, గొట్టిపాటి, అనగాని ధ్వజం

అమరావతి, నరసరావుపేట, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): జగన్‌ శవ రాజకీయాలు చేస్తూ తాజాగా ఇద్దరి మరణానికి కారణమయ్యారని రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌, అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో నిమ్మల మాట్లాడుతూ ‘జగన్‌కు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోలీసులంటే లెక్క లేదు. కోర్టులు, నిబంధనలను ఖాతరు చేయరు. బెట్టింగ్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని పరామర్శించడానికి జగన్‌ వెళ్లడం ఏమిటి? పరామర్శకు వెళ్లేటప్పుడు మందీమార్బలంతో హడావుడి ఏమిటి? డీజే పాటలు, తీన్‌మార్లతో ఎవరైనా పరామర్శకు వెళ్తారా! రప్పా రప్పా తలలు నరుకుతామంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తారా?’ అని నిలదీశారు. ఇలాంటి వికృత చేష్టలకు మద్దతు పలికే జగనే రాజకీయాల్లో కొనసాగేందుకు అనర్హుడన్నారు. కాగా, జగన్‌ స్వార్థ రాజకీయానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని సింగయ్య తీవ్ర గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా వైసీపీ నేతలెవ్వరూ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా రోడ్డు పక్కనే వదిలేశారని, వారంతా మానవత్వం మరచిపోయారని విమర్శించారు.

సింగయ్య మృతికి జగనే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఖాళీ అవుతున్న వైసీపీని కాపాడుకోడానికే జగన్‌ డ్రామాలాడుతున్నారని, ఆయన చేస్తున్నవన్నీ మోసపూరిత పరామర్శలు, వాగ్దానాలేనని, ఆ పార్టీనే ఒక మోసపూరిత పార్టీ అని గొట్టిపాటి విమర్శించారు. శవ రాజకీయాలు చేయడం జగన్‌కే చెల్లుబాటవుతుందని మంత్రి అనగాని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులను పరామర్శించడం తెలియని జగన్‌ క్రిమినల్స్‌ పరామర్శకు మాత్రం ముందుంటారన్నారు. వైనాట్‌ 175పై బెట్టింగ్‌ కట్టి డబ్బులు పోగొట్టుకొని నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, అతను చనిపోయిన ఏడాదికి పరామర్శ పేరుతో జగన్‌ నానా హంగామా చేశారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. నాగమల్లేశ్వరరావు చనిపోయిన రోజు జగన్‌ ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారని, ఆయన మృతికి జగనే కారణమని తెలిపారు. దేశం మొత్తం ఏపీ లిక్కర్‌ స్కాం వైపు చూస్తోందని, దానినుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు జగన్‌ ఫేక్‌ పరామర్శలు ప్రారంభించారని విమర్శించారు. జగన్‌కి జనాలు ఓట్లు వేయలేదనే కక్షతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. మొన్న బూతు.. నిన్న గంజాయి.. నేడు బెట్టింగ్‌.. ఇదీ జగన్‌ పరామర్శ యాత్రల తీరు అని ఆయన విమర్శించారు.

Updated Date - Jun 19 , 2025 | 05:16 AM