ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: యోగా.. ప్రపంచ ఐక్యత స్ఫూర్తికి ప్రతిబింబం

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:23 AM

యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • యోగా కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి

  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

  • 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సందేశం విడుదల

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మోదీ సందేశంతో కూడిన లేఖను మంగళవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. శరీరం, మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా సమగ్ర, ప్రశాంత, సంతృప్తికరమైన జీవనశైలి వైపునకు మార్గనిర్దేశం చేస్తుంది. శారీరకంగా, మానసికంగా సాధికారత పొందిన పౌరులు దేశ నిర్మాణంలో అత్యంత ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనం. యోగా ద్వారా మనం స్వావలంబన, అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన జాతీయ సంకల్పాన్ని మరింత బలంగా, వేగంగా సాధించగలుగుతాం’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జరిగే ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మహోత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయతీ భవన్‌, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. దీని వల్ల పిల్లలు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు యోగా ప్రయోజనాలు పొంది, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచుకోగలరన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని ప్రధాని పిలుపునిచ్చారు.

  • ప్రపంచానికి మోదీ... ప్రతి ఇంటికీ బాబు...

  • యోగా దినోత్సవంపై బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి

‘యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేలా మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు తీర్చిదిద్దితే... మన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నలుమూలలకు యోగాను తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు’ అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పదకొండేళ్ల మోదీ పాలనలో దేశంలోని వివిధవర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 05:23 AM