Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం
ABN, Publish Date - Jun 02 , 2025 | 03:46 AM
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ కాలేజీలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఎంబైపీసీ కోర్సు అవకాశం కల్పించారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా నేడే
ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబైపీసీ
అమరావతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం సమయాల్లో ఇంటర్ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్ 1నే ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహించి, ఆపై వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి 2025-26 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నేటి నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచే కొత్తగా ఎంబైపీసీ చదివే అవకాశం విద్యార్థులకు కల్పించారు.
Updated Date - Jun 02 , 2025 | 03:49 AM