ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SIT Officer Misstep: గ్రూప్‌ 1 కేసులో ఇన్‌స్పెక్టరు అతి

ABN, First Publish Date - 2025-05-10T04:28:02+05:30

గ్రూప్‌-1 డిజిటల్ మూల్యాంకన స్కామ్‌లో ఏ2 నిందితుడైన ధాత్రి మధు అరెస్టులో ఓ ఇన్‌స్పెక్టర్‌ అనవసర వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. "మధు మంచోడు" అంటూ చేసిన వ్యాఖ్యపై సీనియర్‌ అధికారులు ఆగ్రహంతో స్పందించి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు

  • ధాత్రి మధు అరెస్టు సమయంలో ‘మంచోడు’ మాట

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): గ్రూపు1 పరీక్షా పత్రాల డిజిటల్‌ మూల్యాంకనం స్కామ్‌ కేసులో నిందితుల అరెస్టు సమయంలో ఓ ఇన్‌స్పెక్టరు ‘అతి’ చేశారు. వివరాలివీ.. ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా పీఎ్‌సఆర్‌ ఉండగా, ఆయన డైరెక్షన్‌లో ‘కామ్‌సైన్‌’ డైరెక్టర్‌ పమిడికాల్వ మధుసూదనరావు (ధాత్రి మధు) అడ్డదారులు తొక్కినట్టు సిట్‌ గుర్తించింది. ఏ2గా నిందితుల జాబితాలో చేర్చి ధాత్రి మధును అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతకుముందు....హైదరాబాద్‌ వెళ్లి ధాత్రి మధును అరెస్టు చేసే పనిని ఓ ఇన్‌స్పెక్టర్‌కు సిట్‌ అప్పగించగా.. ‘‘గ్రూపు 1 కేసును అనవసరంగా నమోదు చేశాం సార్‌...’’ ‘మధు మంచోడు సర్‌’ అనే అర్థం వచ్చేలా ఓ సీఐ మాట్లాడటంతో సెల్‌ కాన్ఫరెన్స్‌లో ఉన్న ఇద్దరు ఏసీపీలకు చిర్రెత్తింది. ముందు చెప్పిన పని చేయండి అంటూ గట్టి ఆదేశాలు ఇచ్చారు. దీనితో మధుసూదన్‌ను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. ఈ వ్యవహారాన్ని సిట్‌ అధికారులు సీరియ్‌సగా పరిగణిస్తున్నారు. ఆ ఇన్‌స్పెక్టర్‌పై విజయవాడ కమిషనర్‌కు నోట్‌ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - 2025-05-10T04:28:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising