Srisailam: శీశైలం జలాశయానికి భారీగా వరద
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:53 AM
ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది.
నంద్యాల, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. బుధవారం నుంచి గురువారం సాయంత్రానికి 88,272 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరింది. జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1.144 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయంలో ప్రస్తుతం 115.7856 టీఎంసీల నీటి లభ్యత ఉండగా.. నీటి మట్టం 863.10 అడుగులకు చేరుకుంది. మరోవైపు, వారం రోజులుగా రెండు పంపు హౌస్‌ల్లోని విద్యుత్ ఉత్పాదన తాత్కాలికంగా నిలిపివేశారు.
Updated Date - Jun 27 , 2025 | 03:53 AM