ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP DGP: ఇక పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని..

Harish Kumar Gupta IPS

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుల్ టైం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీసు దళానికి నిర్ణయాత్మక, క్రమశిక్షణ కలిగిన, దార్శనిక నేతృత్వాన్ని హరీష్ గుప్తా అందించనున్నారని ఏపీ పోలీస్ శాఖ తెలిపింది. రెండేళ్ల పాటు హరీష్ గుప్తా తన సేవల్ని దృఢ సంకల్పంతో అందిస్తారని పేర్కొంది. ఇలా ఉండగా, రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తా శనివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఫిబ్రవరి 1 నుంచి ఆయన ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పంపిన ప్యానల్‌లో నుంచి హరీష్‌కుమార్‌ గుప్తాను ఎంపిక చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల హరీష్ గుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీష్‌కుమార్‌ గుప్తా ఈ పోస్టులో కొనసాగుతారు. ఈ సందర్భంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులంతా గుప్తాను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం డీజీపీ వారితో సమావేశమై పోలీసు శాఖ ప్రాధమ్యాల్ని వివరించారు.


ఇవీ చదవండి:

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 03:28 PM