ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Household Budget: ఇంటి బడ్జెట్‌పై కేంద్ర మంత్రి పెమ్మసాని సతీమణి ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2025-02-16T15:12:58+05:30

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డా.రత్న ఇంటి బడ్జెట్ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సంపాదన, ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలనే విషయాలను చెబుతూ ఆమె రూపొందించిన వీడియో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Pemmasani Chandrashekhar wife Dr. Ratna

అమరావతి: ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల గురించి ఎంతో ఆసక్తి నెలకొంటుంది. దేనికి ఎంత కేటాయిస్తారో, మనకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా? అని పేద, మధ్య తరగతి ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అయితే మరి మీరెప్పుడైనా ఇంటి బడ్జెట్ గురించి ఆలోచించారా?. నెల లేదా ఏడాదికి మన సంపాదన ఎంత, ఖర్చు ఎంత అనేది ఏ రోజైనా ఆలోచించారా?. లేదా.. అయితే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డా.రత్న చెప్పిన ఇంటి బడ్జెట్ గురించి తెలుసుకోండి. సంపాదన, ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలనే విషయాలను చెబుతూ ఆమె రూపొందించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోలో సంపాదన, ఖర్చులు, పొదుపు వంటి అంశాలనే కాకుండా ఆర్థిక నిర్వహణలో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో వచ్చే మార్పులను సైతం రత్న వివరించారు.


చాలా మంది బాగా డబ్బు సంపాదిస్తున్నప్పటికీ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని డా.రత్న తెలిపారు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, అత్యవసరాలను అంచనా వేయలేక వచ్చిన ఆదాయానికి మించి అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. మనం ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు సాధించి సంపాదించేది కుటుంబాన్ని బాగా చూసుకోవడం కోసమేనని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటిది సంపాదించే సమయంలో ఆర్థిక లావాదేవీలు సరిగ్గా మేనేజ్ లేయలేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చిన్నతనంలోనే తన తండ్రి.. మెుత్తం ఆర్థిక లావాదేవీల గురించి తనకు చెప్పారని, ఆ సంవత్సర ఆదాయం, ఖర్చులు రాసి తనకు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అలాగే మనం ఎవరికి ఎంత ఇవ్వాలి, మనకు ఎవరెంత ఇవ్వాలనే విషయాలనూ తనకు ముందే చెప్పారని తెలిపారు. చిన్నప్పటి నుంచే అలా ఆర్థిక లావాదేవీల్లో తనను భాగస్వామం చేయడంతో చిన్న వయస్సులోనే తాను వృథా ఖర్చులు పెట్టడం మానేసినట్లు పేర్కొన్నారు. తనకు తెలియకుండానే తనలో పెద్దరికం వచ్చేసిందని రత్న గుర్తు చేసుకున్నారు.


ఆర్థిక నిర్వహణపై డా.రత్న చెప్పిన మరిన్నీ విషయాలను కింద ఉన్న వీడియోపై క్లిక్ చేసి చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి:

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

YSRCP: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్

Updated Date - 2025-02-16T15:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising