Share News

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Feb 16 , 2025 | 02:04 PM

Minister Narayana: గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు.

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ  కీలక నిర్ణయాలు
Minister Narayana

నెల్లూరు: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ(ఆదివారం) నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ మాగుంట సుబ్బరామిరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్‌ను నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు.


పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తాం..

ప్రజల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ నెల్లూరు పార్కుల్లో జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. జాకీర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్క్‌లో రూ.40 లక్షలతో జిమ్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు నేడు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ చెప్పారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. అన్ని మున్సిపల్ పాఠశాలల్లో కూడా జిమ్ ఎక్విప్‌మెంట్, క్రీడా పరికరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ అన్నారు. సంతపేట గుంటబడికి విశాలమైన ఆట స్థలం ఉందని క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

NARAYANA-1.jpg


క్రీడలకు ప్రోత్సాహం..

గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు. కొన్ని ఆట స్థలాల్లో బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. నెల్లూరు నగరంలో 3000 వీధి లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. నెల్లూరు పార్కుల్లో జిమ్ పరికరాల ఏర్పాటుతో ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్నామని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు నగరంలోని అన్ని పార్కుల్లో ఉచిత ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, శారీరక వ్యాయామాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి నారాయణ చెప్పారు. పిల్లలు, యువత, వృద్ధులతో సహా అన్ని వయస్సుల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ,టీడీపీ నేతలు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!

Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 16 , 2025 | 02:11 PM