Tiranga Rallies: ఆపరేషన్ సిందూర్.. సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీలు
ABN, Publish Date - May 17 , 2025 | 12:01 PM
Tiranga Rallies: ఏపీ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా తిరంగా ర్యాలీ చేపట్టారు.
గుంటూరు, మే 17: ఏపీలో తిరంగా ర్యాలీలు (Tiranga Rallies) కొనసాగుతున్నాయి. గుంటూరులో ఆపరేషన్ సిందూర్ సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి భారీగా ప్రజలు హాజరయ్యారు. జాతీయ జెండాలతో నగరవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అత్యంత దుర్మార్గమన్నారు.
ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులను అంతం చేశామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైన్యానికి హాట్సాఫ్ తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీనాయక్ త్యాగాన్ని దేశ ప్రజలు మర్చిపోరన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రక్షణే మొదటి ప్రాధాన్యమని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.
అనంతపురం: ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం సందర్భంగా అనంతలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ నుంచి టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ వరకు జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ , కలెక్టర్ వినోద్ కుమార్ , ఎస్పీ జగదీష్ , జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా: వేమూరులో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. సమచార శాఖ మంత్రి పార్దసారధి , జిల్లా కలెక్టర్ మురళీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేమూరు సెంటర్‌లో చలివేంద్రం ప్రారంభించారు. రైతులకు వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేశారు. స్వచ్ఛంద - స్వర్ణాంధ్రలో భాగంగా మానవహారం నిర్వహించారు. వేమూరులో రోడ్ల వెంట మంత్రి పార్దసారధి, ఎమ్మెల్యే ఆనంద బాబు మొక్కలు నాటారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలతో మంత్రి పార్దసారధి ప్రతిజ్ఞ చేయించారు. ఉచిత వైద్య శిభిరాన్ని పార్దసారధి, ఆనంద బాబు ప్రారంభించారు.
తూర్పుగోదావరి జిల్లా: దేశం కోసం సైన్యం -సైన్యం కోసం మనం అంటూ కొవ్వూరులో తీరంగ యాత్ర భారీ ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సిందూర్‌కు అభినందనలు తెలుపుతూ కొవ్వూరు పట్టణంలో 1500 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా యాత్రి నిర్వహించారు. పట్టణ ప్రముఖులు, నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్రను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు.
పశ్చిమగోదావరి జిల్లా: ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్బంగా భీమవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర సహయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజినేయులు, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, టిడిపి రాష్ట్ర పాలిటి బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కూటమి నాయకులు, అధికారులు పాల్టొన్నారు. విస్సాకొడేరు వంతెన వద్ద నుంచి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వరకూ ర్యాలీ సాగింది.
ఇవి కూడా చదవండి
Kakani Govardhan Reddy: తప్పుదారి పట్టిస్తారా
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
Read Latest AP News And Telugu News
Updated Date - May 17 , 2025 | 12:01 PM