ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dhulipalla slams Jagan: నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి జగన్.. ఎమ్మెల్యే ఆగ్రహం

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:32 PM

Dhulipalla slams Jagan: యువతను రెచ్చగొట్టి నేరాల వైపు జగన్ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల మండిపడ్డారు. జగన్ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు.

Dhulipalla slams Jagan

గుంటూరు, జూన్ 20: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నేరపూరిత స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. క్రిమినల్ ముఖ్యమంత్రికి, అభివృద్ధి చేసే ముఖ్యమంత్రికి తేడా జగన్, చంద్రబాబుని చూస్తే తెలుస్తుందన్నారు. యువతను రెచ్చగొట్టి నేరాల వైపు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.జగన్ హయాంలో పోలీసులపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. యువత ఏదైనా తప్పు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. ఈరోజు ఉదయం జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలో రైతులకు వ్యవసాయ డ్రోన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో సాంకేతికత వినియోగం తప్పనిసరిగా మారిందని అన్నారు. కూలీల కొరత అధిగమించేందుకు పరికరాలు, యాంత్రీకరణ అవసరమన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు పురుగు మందుల పిచికారిలో ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 80 శాతం రాయితీతో డ్రోన్లు ఇస్తున్నాయన్నారు. గ్రామంలో చదువుకున్న యువతకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తద్వారా వారికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి డ్రోన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కడప కార్పొరేషన్ సమావేశం.. మాధవీరెడ్డి కుర్చీపై ఉత్కంఠ

భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

టేకాఫ్ సమయంలో టెక్నికల్ ఇష్యూ.. నిలిచిన విమానం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 12:32 PM