Minister Nara Lokesh: ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Mar 06 , 2025 | 01:37 PM
Minister Nara Lokesh: పాఠశాల, కాలేజీ విద్యపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో మాట్లాడారు. స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అమరావతి: కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అన్నారు. పలు సమస్యలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల చెల్లింపు వల్ల ఎక్కువగా పిల్లలు ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయన్నారు. పాఠశాల విద్యలోనూ మానసికంగా వేధిస్తున్నారనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. ఆత్మహత్యలపై నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపైనా ఉందని చెప్పారు. ఆత్మహత్యల విషయమై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు విద్యాసంస్థలు బాగుంటాయనే ప్రచారం బయట ఉందని.. ఇది సరైనది కాదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు 12 లక్షల మంది పిల్లలు దూరమయ్యారని అన్నారు. చాలా మంది ప్రైవేటు విద్యా సంస్థలవైపు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, టీచింగ్ స్టాఫ్ పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Judicial Magistrate : పోసానికి ఆదోని కోర్టు రిమాండ్
AP Govt: పెట్టుబడుల పర్యవేక్షణకు‘స్టేట్ ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్’
AP Govt: రెవెన్యూ చట్టాల్లో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం
Read Latest AP News and Telugu News
Updated Date - Mar 06 , 2025 | 01:42 PM