ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

ABN, Publish Date - Feb 22 , 2025 | 09:26 PM

Mannava Subbarao:రైతు సంక్షమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రైతు సంఘం నేత మన్నవ సుబ్బారావు తెలిపారు. రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

Mannava Subbarao

అమరావతి: మిర్చి రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబుతో రైతు సంఘం నేత మన్నవ సుబ్బారావు ఇవాళ(శనివారం) ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు మన్నవ సుబ్బారావు వెల్లడించారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు సంఘం నేత మన్నవ సుబ్బారావు తెలిపారు.


సీఎం చంద్రబాబు రైతులకు సంబంధించి కొన్ని సూచనలు చేశారని అన్నారు. ఎకరాకు రూ.3 లక్షలు అవుతుందంటే సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. మిర్చి పంటలకు టెక్నాలజీ. వాడమని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. ఎలక్ట్రానిక్ కాటా ఉపయోగించమని సీఎం చెప్పారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సహాయం అందుతుందని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. జగన్ వచ్చినపుడు నిజమైన రైతులు ఆందోళన చేయలేదని చెప్పారు. కిరాయి మూకలు వచ్చి ఆందోళన చేశారని మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే

Read Latest AP News And Telugu News


మిర్చి ధరలపై చర్చ..

అంతకుముందు మిర్చి రైతులు, యార్డు ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మిర్చి రైతుల సమస్యలు, ప్రస్తుత మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ, సహచర మార్కెంటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుతు రాజశేఖర్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు, వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, వ్యవసాయశాఖకు సంబంధించి అధికారులు, ట్రేడర్లు సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా మిర్చి ధర గత కొంతకాలంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అయి రాష్ట్రంలో మిర్చి రైతుల సమస్యలపై వివరించడం, దానిపై కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రంలో చిల్లి ధర పరిస్థితిపై స్పందించి.. కేంద్రం నుంచి సహాయం అందిస్తామని చెప్పడంతో ఈరోజు గుంటూరు మిర్చి యార్డు ట్రేడర్లు, మిర్రి కొనుగోలు చేసే వర్తకులతో సీఎం కీలక సమావేశం నిర్వహించారు.

Updated Date - Feb 22 , 2025 | 09:38 PM