Robbery: వీళ్లు మాములు దొంగలు కాదండోయ్.. ఎంత తెలివిగా మోసం చేస్తున్నారో తెలుసా
ABN, Publish Date - Feb 22 , 2025 | 08:41 PM
Robbery: ఏపీలో హైటెక్ దొంగతనం జరిగింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో దొంగలు బంగారం కాజేశారు. సుమారురూ. 5 కోట్లు విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గుంటూరు జిల్లా: మంగళగిరిలో బంగారం చోరీ కేసులను పోలీసులు చేధించారు. రూ.5 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆరు రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన 5 కేజీల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయని తెలిపారు. ఆభరణాలు చోరీకి గురయ్యాయని యజమాని రాముకు తన వద్ద పనిచేసే నాగరాజు ఫోన్ చేసి చెప్పారని అన్నారు. ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. చోరీ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశామని వివరించారు. నిందితుల ఎవరికీ నేర చరిత్ర లేదన్నారు. బైక్‌పై వస్తున్న నాగరాజు వద్ద నుంచి ఇర్ఫాన్, మోహన్, నవీన్‌లు మరొక బైక్‌తో వచ్చి బ్యాగ్ తీసుకెళ్లారని చెప్పారు. బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు నాగరాజు ప్రతిఘటించలేదని అన్నారు. బంగారాన్ని తీసుకెళ్లి టైర్‌లో దాచి పెట్టారని చెప్పారు. కొంత బంగారాన్ని కరిగించారని.. దాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.
పెనుగొండలో 49 కాసుల బంగారం రికవరీ
పశ్చిమగోదావరి: పెనుగొండలో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే 49 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దొంగతనం కేసును 24 గంటల్లో పెనుగొండ పోలీసులు చేధించారు. త్వరగా రికవరీ చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ నయీం ఆస్మి ప్రశంసించారు. ఆచంటలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయిీం ఆస్మి మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. చోరీకి పాల్పడిన పెనుగొండకు చెందిన బండారు గణేష్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. చోరీ చేసిన 49 కాసులు బంగారం రికవరీ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో ఉద్యోగాలే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 22 , 2025 | 08:46 PM