Union Budget 2025: ఇది మోదీ మార్క్ బడ్జెట్.. లంకా దినకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Feb 01 , 2025 | 06:09 PM
Lanka Dinakar: ఈ బడ్జెట్ అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత బడ్జెట్ అని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ సంవత్సరంలో రాజధాని అమరావతిలో 50 కు పైగా వివిధ కేంద్ర సంస్థల నిర్మాణాలు ప్రారంభం అవుతాయని లంకా దినకర్ పేర్కొన్నారు.
అమరావతి: దేశ సమ్మిళిత అభివృద్ధిని నిర్దేశించే విధంగా మోదీ మార్క్‌తో కూడిన బడ్జెట్ ఇదని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. పేద, మహిళ, మధ్య తరగతి సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారని చెప్పారు. ఇది వికసిత భారత్ మోదీ 3.0 బడ్జెట్ అన్నారు. వ్యక్తిగత ఆదాయం పన్ను రూ.12 లక్షల వరకు మినహాయింపు, ఉద్యోగులకు రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకొరూ.12.75 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. రెండు స్వయం నివాస గృహాలు వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందన్నారు.
36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన డ్యూటీ మినహాయింపు ఇవ్వడం మంచి నిర్ణయమని అన్నారు. మధ్యతరగతి వర్గాల వస్తూ, సేవల వినియోగం వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ బడ్జెట్ అంత్యోదయ స్ఫూర్తితో రూపొందించిన వికసిత భారత్ బడ్జెట్ అని వివరించారు. 8 వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా నిర్మల సీతారామన్ రికార్డ్ సృష్టించారని అన్నారు. రూ.10.18 లక్షల కోట్ల మూలధన వ్యయంతో ఉత్పాదక ఆస్తుల కల్పనకు ఊతం ఇస్తుందని తెలిపారు.
గ్రామాలకు కుళాయిలు ద్వారా సురక్షిత తాగు నీరు కోసం జల్ జీవన్ మిషన్ 2028 వరకు పొడిగింపు ఆహ్వానించదగ్గ అంశమని చెప్పారు. అమరావతి కోసం రూ.15 వేల కోట్లు, పోలవరం నిర్మాణం కోసం రూ.12,157 కోట్లు గత బడ్జెట్‌లో ప్రకటించిన నిధులు, ఖర్చు ఆధారంగా ఈ సంవత్సరం విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో రూ.5 ,936 కోట్లు కేటాయించడంపైన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లకు కృతఙ్ఞతలు తెలిపారు. రాజధానిలో 50 కు పైగా వివిధ కేంద్ర సంస్థల నిర్మాణం ఈ సంవత్సరంలో ప్రారంభం అవుతాయని లంకా దినకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CII on Budget 2025: దేశానికి ప్రోత్సాహకంగా బడ్జెట్.. సీఐఐ రియాక్షన్
Union Budget 2025-26: ఏపీ జీవనాడికి ఊపిరి పోసిన నిర్మలమ్మ
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 01 , 2025 | 06:09 PM