AP Govt: మరో హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం
ABN, Publish Date - Feb 12 , 2025 | 10:03 AM
AP GOVT: వైసీపీ పాలనలో గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
అమరావతి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశాఖపట్నానికి చెందిన తహసీల్దార్ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హత్యకు గురైన రమణయ్య భార్య అనూషను డిప్యూటీ తహసీల్దార్‌గా నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రమణయ్య భార్య అనూషకు కారుణ్య నియామకంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్‌గా నియమించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృషి చేశారు. తమను ఆదుకుని, న్యాయం చేసినందుకు మంత్రి అచ్చెన్నాయుడుకు, ప్రభుత్వానికి డిప్యూటీ తహసీల్దార్ అనూష కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీని గాడిలో పెడుతున్న సీఎం చంద్రబాబు
కాగా.. వైసీపీ పాలనలో గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పగ్గాలు చేపట్టిన కొద్దీ రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేశారు. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు, మెగా డీఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకుంది. త్వరలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి
ఏడాదైనా ఫైళ్లు క్లియర్ చేయరా?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 12 , 2025 | 10:10 AM