Digital Lakshmi: లేడీస్‌కి గుడ్ న్యూస్.. ఇక, ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్
ABN, Publish Date - May 24 , 2025 | 05:58 PM
మహిళల సాధికారతకు ఏపీ ప్రభుత్వం మరో పథకంతో ముందుకొచ్చింది. ఫలితంగా ఆడవాళ్లకు ఇంటిదగ్గరే సంపాదించుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కుతుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలకు ఈ అవకాశం దక్కబోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలోని మహిళలకు మరింత సాధికారత చేకూర్చేలా చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డ్వాక్రా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో డిజిటల్ లక్ష్మి(Digital Lakshmi) పథకం తీసుకొస్తోంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలను డిజిటల్ లక్ష్మిలుగా నియమించబోతోంది. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడంతోపాటు, అదే స్థానంలో డ్వాక్రా మహిళలన్ని డిజిటల్ లక్ష్మిలుగా నియమించి అవే సేవలు అందించబోతోంది. ఇందుకోసం డిగ్రీ , ఆపై చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల్ని నియమించబోతోంది.
డిజిటల్ లక్ష్మిగా నియమించబడిన డ్వాక్రా సంఘంలోని మహిళ.. డ్వాక్రా మహిళలతో పాటు, స్థానికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అప్లై చేయడంతోపాటు, ఇతర డిజిటల్ సేవల్ని(బిల్స్ పేమెంట్స్ వంటివి) అందించాల్సి ఉంటుంది. తమ ఇంటి ముందున్న చిన్న రూంలో ఈ కేంద్రం పెట్టుకుని మీ సేవా తరహాలో నిర్వహించుకోవచ్చు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు రుణం కూడా ఇస్తారు. డిజిటల్ లక్ష్మిగా పనిచేయడానికి ఎంతో కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై డ్వాక్రా సంఘాల మహిళలు, ప్రజానీకం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రుణాలు అందించడంతో పాటుగా చదువుకున్న మహిళల్ని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక చేయూతను అందించేలా చంద్రబాబు సర్కారు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం బాగుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.
ఇవి కూడా చదవండి
ఆ ఇద్దరి మృతదేహాలు అప్పగించండి.. హైకోర్టులో పిటిషన్
Read latest AP News And Telugu News
Updated Date - May 24 , 2025 | 05:58 PM