ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam: స్టీల్‌ ప్లాంటులో ప్రమాదం

ABN, Publish Date - May 01 , 2025 | 05:01 AM

విశాఖ స్టీల్‌ప్లాంట్ బ్లాస్ట్‌ఫర్నేస్‌-1లో గ్యాస్‌ లీక్ కావడంతో నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ ఆరోపించింది.

  • బ్లాస్ట్‌ఫర్నే్‌స-1లో గ్యాస్‌ లీక్‌

  • నలుగురికి అస్వస్థత ఒకరి పరిస్థితి విషమం

ఉక్కుటౌన్‌షిప్ (విశాఖపట్నం), ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): స్టీల్‌ప్లాంటులోని బ్లాస్ట్‌ఫర్నేస్‌-1 విభాగంలో బుధవారం సాయంత్రం గ్యాస్‌ లీకవ్వడంతో నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాస్ట్‌ఫర్నేస్‌-1 విభాగంలో ట్యూయల్‌ ప్లాట్‌ఫాంపై హోస్‌ పైపును మార్చే క్రమంలో గ్యాస్‌ లీకైంది. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సుస్మిత్‌ (సీనియర్‌ మేనేజర్‌), యాదవ్‌ (సీనియర్‌ మేనేజర్‌), ఎ.వెంకటేశ్వరరావు (ఫోర్‌మన్‌), రామరాజు (ఫోర్‌మన్‌) అస్వస్థతకు గురయ్యారు. నలుగురూ అక్కడే పడిపోవడంతో సమీపంలో ఉన్న ఉద్యోగులు గమనించి వెంటనే గ్యాస్‌ సరఫరాను నిలిపివేశారు. వారిని హుటాహుటిన ఉక్కు జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మిగిలిన ముగ్గురికి ఉక్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే : సీఐటీయూ

ప్లాంటులో ఉత్పత్తి పెంచే క్రమంలో భద్రతను యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందని, అందుకే ప్రమాదం చోటుచేసుకుందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. క్షతగాత్రులను తరలించే సమయంలో అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సదుపాయం కూడా లేదని ఆరోపించారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:01 AM