CM Chandrababu Naidu: ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు
ABN, Publish Date - Jul 03 , 2025 | 06:27 AM
రాష్ట్రంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జూన్ వరకు ఉద్యోగులకు ఉచిత వసతి కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు ఈ ఉచిత వసతి పొడిగింపు వర్తిస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేశారు.
దీంతో ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి ఉచిత వసతి, ఐదు రోజుల పనిదినాల వెసులుబాటు కల్పించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఉచిత వసతి, ఐదు రోజుల పనిదినాలు సౌకర్యాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉచిత వసతి సౌకర్యాన్ని రద్దు చేసినప్పటికీ ఉద్యోగుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించింది.
Updated Date - Jul 03 , 2025 | 06:27 AM