ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

ABN, Publish Date - May 18 , 2025 | 03:56 PM

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టయ్యారు. టీడీపీ కార్యకర్త రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో అతడిని అరెస్ట్ చేశారు.

YCP Leader Nandigam Suresh

గుంటూరు,మే 18: ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేష్‌ను తుళ్లూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నందిగం సురేష్ అరెస్ట్‌పై సమాచారం అందుకున్న అతడి భార్య బేబీ లతా.. తుళ్లూరు పోలీస్ స్టేషన్‌‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించారు. తన భర్త నందిగం సురేష్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అయితే తన భర్త రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ దాడి చేశారంటూ లక్ష్మీ అనే మహిళ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువర్గాల మధ్య దాడి చోటు చేసుకుంది. ఈ దాడిలో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం శనివారం రాత్రి మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలోకి వేగంగా కారు దూసుకొచ్చింది. కారు అతివేగంపై డ్రైవర్‌ను రాజు మందలించారు. అక్కడికి కాసేపటి తర్వాత సురేష్ అనుచరులు వచ్చి అతడిపై దాడి చేసి.. సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో అక్కడ మరోసారి సురేష్, అతడి సోదరుడు ప్రభుదాసుతోపాటు ఇతరులు రాజుపై దాడి చేశారు.

గాయాలపాలైన రాజుని కుటుంబసభ్యులు మంగళగిరి ఎయిమ్స్‌లో చేర్చారు. అనంతరం రాజు భార్య లక్ష్మీ.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నందిగం సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సురేష్ సోదరుడు, బంధువుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:33 PM