ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి కస్టడీలో అస్వస్థత.. ఆయా వర్గాల్లో ఉత్కంఠ

ABN, Publish Date - May 24 , 2025 | 07:25 AM

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఆరోగ్య పరిస్థితి, ఆయనపై నమోదైన కేసులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయన కస్టడీలో ఉండగానే అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Vallabhaneni Vamsi police custody

అమరావతి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi police custody) పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయన రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండగా, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. రాత్రి సమయంలో కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచిన ఆయనకు ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే వంశీని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు రెండు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ఆయన శ్వాసకోశ సమస్యలను గుర్తించి, అవసరమైన చికిత్సను అందించారు.


పరీక్షల తర్వాత..

వైద్య పరీక్షల అనంతరం వంశీని మళ్లీ జైలుకు తరలించినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ గుర్తింపు పొందారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ (TDP) తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తర్వాత వైసీపీ(YSRCP)లో చేరారు. అయితే, వంశీపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసు ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది. ఈ కేసులో అతనిపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. నూజివీడు కోర్టు ఆదేశాల మేరకు వంశీని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.


కక్షసాధింపు చర్యగా..

ఈ సంఘటన వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై మరింత అనిశ్చితిని నెలకొల్పింది. ఆయనపై నమోదైన కేసుల్లో ఒకటైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఇతర కేసులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో విడుదల అవకాశం లేదని తెలుస్తోంది. ఈ కేసులు ఆయన రాజకీయ కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. స్థానికంగా, వంశీ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ కేసులను రాజకీయ కక్షసాధింపు చర్యగా భావిస్తున్నారు. ఒక బలమైన నాయకుడిని కాపాడలేకపోతున్నారని, కార్యకర్తలను పార్టీ అధిష్ఠానం ఎలా కాపాడుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.


ఇవీ చదవండి:

వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..

బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 24 , 2025 | 07:42 AM