ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Food Processing Society: ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు

ABN, Publish Date - May 27 , 2025 | 05:09 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహారశుద్ధి పరిశ్రమలు మరియు ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లకు ₹105 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల చేసింది. ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన బడ్జెట్‌లో భాగంగా ఇవ్వబడ్డాయి.

  • 105 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆహారశుద్ధి పరిశ్రమలకు రూ. 75 కోట్లు, ఆక్వా ఉత్పత్తుల (చేపలు, రొయ్యలు) ప్రాసెసింగ్‌ యూనిట్లకు రూ. 30 కోట్లు కలిపి మొత్తం రూ. 105 కోట్ల ప్రోత్సాహకాల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతినిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీకి కేటాయించిన మొత్తం బడ్జెట్‌లో మొదటి త్రైమాసికానికి సంబంధించి రూ. 26.33 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే క్వార్టర్లీగా కాకుండా ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తం బడ్జెట్‌ రూ. 105.33 కోట్లు విడుదల చేయాలని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈవో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆ మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Updated Date - May 27 , 2025 | 05:11 AM