Amaravati Fire Scare: రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు
ABN, Publish Date - May 03 , 2025 | 04:39 AM
ప్రధాని సభ సమయంలో గన్నవరం, మందడం వద్ద రెండు అగ్నిప్రమాదాలు సంభవించాయి. సకాలంలో ఫైరింజన్లు స్పందించి మంటలను అదుపు చేశాయి
తుళ్లూరు (మందడం)/గన్నవరం, మే 2(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ వచ్చే ముందు గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టవర్ సమీపంలో మంటలు వ్యాపించాయి. అధికారులు వెంటనే ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. అలాగే అమరావతిలో ప్రధాని సభ జరుగుతున్న సమయంలో వేదికకు ఐదు కిలోమీటర్ల దూరంలో మందడం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మరో అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని నిర్మాణ పనుల నిమిత్తం నిల్వ చేసిన ప్లాస్టిక్ పైపుల గుట్టకు నిప్పు అంటుకుంది. దాదాపు గంటన్నర పాటు మంటలు చెలరేగుతూ ఆకాశంలో పొగ కమ్మేసింది. ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలపై అధికారులు విచారణ చేస్తున్నారు.
Updated Date - May 03 , 2025 | 04:39 AM