ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Free Admission: ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల గడువు పొడిగింపు

ABN, Publish Date - Jun 29 , 2025 | 03:55 AM

విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది.

  • అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు: సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు

అమరావతి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టం కింద ఈ విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం లాటరీ ద్వారా ఎంపిక చేసిన రెండో విడత జాబితాలోని విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం జూలై 2వ తేదీ వరకు గడువు పొడిగించింది. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి.శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ నెంబర్లకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయడంతోపాటు వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

పూర్తి వివరాల కోసం టోల్‌ ఫ్రీ నెంబరు 18004258599లో సంప్రదించాలని సూచించారు. రెండో విడత లాటరీలో 8,583 మంది విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సీట్లు కేటాయించారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి వారికి ఉచిత ప్రవేశాలు కల్పించాలని, సరైన కారణం లేకుండా అడ్మిషన్లు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 29 , 2025 | 06:31 AM